A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
పోలీస్ వ్యవస్తకు పచ్చ చొక్కా తొడిగింది బాబే
Share |
September 23 2019, 2:34 am

పోలీసు వ్యవస్థను ఇష్టం వచ్చినట్లు వాడుకున్న ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు ఇప్పుడు మాట్లాడుతున్న తీరు దారుణంగా ఉందని వైఎస్ ఆర్ కాంగ్రెస్ ఎమ్.పి విజయసాయిరెడ్డి విమర్శించారు. ఆయన ట్విటర్ లో వ్యాఖ్య చేశారు.
‘మీ పాలనలో వ్యవస్థలన్నిటినీ నిర్వీర్వం చేసి పోలీసులకు పచ్చ యూనిఫాం తొడిగించారు. అందుకే వైఎస్‌ జగన్‌ గారు నాడు సీబీఐ దర్యాప్తు కోసం డిమాండు చేశారు. ఇప్పుడు పోలీసులు స్వేచ్ఛగా పనిచేస్తున్నారు. డౌట్‌ ఉంటే శాంపిల్‌గా కోడెల కుటుంబం కేసులను సీబీఐకి అప్పగించమని అడగొచ్చుగా చంద్రబాబు గారూ’ అని ఆయన అన్నారు.

‘పచ్చ దొంగలకు అమరావతి తప్ప ఇంకేది పట్టదు. లక్షల కోట్ల రియల్ ఎస్టేట్ రాబడుల గురించే ధ్యాసంతా. అందుకే ఏదో ఒక కృత్రిమ సమస్యను సృష్టించి అనుకూల మీడియాతో అలజడి లేపాలని చూస్తున్నారు. ఐదేళ్లు అధికారంలో ఉండి నారా చంద్రబాబు, లోకేష్‌ చేసింది అదే కదా’ అని కూడా విజయసాయిరెడ్డి ట్వీట్ చేశారు.

tags : vijayawaireddy

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info