A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
జగన్ స్వేచ్చ ఇవ్వడం వల్లే ఇది సాధ్యమైంది
Share |
September 23 2019, 2:35 am

స్వేచ్చ ఇస్తే బ్యూరోక్రసి ఎంత సమర్దంగా పనిచేస్తుందో ఎపిలో రుజువు అయిందని ప్రభుత్వ సలహాదారు అజయ్ కల్లెం అన్నారు.గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగ నియామకాలలో ఎలాంటి రాజకీయ జోక్యానికి తావులేకుండా ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పూర్తి స్వేచ్ఛ ఇవ్వడం వల్ల ఈ ప్రక్రియ అత్యంత పారదర్శకంగా సాగుతోందని ఆయన తెలిపారు. రాజకీయ జోక్యం లేకుంటే ఏ పనిలోనైనా అధికారుల పనితీరు అద్భుతంగా ఉంటుందనేందుకు ఈ ఉద్యోగాల నియామక ప్రక్రియే నిదర్శనమన్నారు. ఉద్యోగాల రాతపరీక్షల ముగింపు సందర్భంగా రాష్ట్ర స్థాయి పరీక్షల కమిటీ చైర్మన్, పంచాయతీరాజ్‌ శాఖ ముఖ్యకార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది, పరీక్షల కమిటీ కంట్రోలర్, పంచాయతీరాజ్‌ శాఖ కమిషనర్‌ గిరిజా శంకర్,మున్సిపల్‌ శాఖ కమిషనర్‌ విజయ్‌కుమార్, సీఎం కార్యాలయ ముఖ్య కార్యదర్శి సాల్మన్‌ ఆరోఖ్యరాజ్‌తో కలిసి అజేయ కల్లం సచివాలయంలో విలేకరులతో మాట్లాడారు.

tags : ajay

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info