A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
యురేనియంపై మాట్లాడిన కుటుంబరావు
Share |
September 23 2019, 1:55 am

యురేనియం దుష్ప్రభావాలపై ప్రజలకు అవగాహన కల్పించాలి :కుటుంబరావు

ప్రజల్లో యురేనియం దుష్ప్రభావాలపై అవగాహన కలిగించేవరకు నల్లమలలో యురేనియం తవ్వకాలు చేయొద్దని మాజీ ప్రణాళిక సంఘం అధ్యక్షులు కుటుంబరావు ఒక ప్రకటనలో పేర్కొన్నారు. యురేనియం తవ్వకాలతో అనేక పర్యావరణ సమస్యలు తలెత్తుతాయని భూసారం దెబ్బతిని మొత్తం నల్లమల అడవులు నాశనం అయ్యే ప్రమాదం ఉందన్నారు. కృష్ణా పరివాహక ప్రాంతంలో ఉన్న మొత్తం జీవవైవిధ్యం ప్రమాదంలో పడే అవకాశం ఉంది. యురేనియం దుష్ప్రభావాలు ముఖ్యంగా గాలి, నేల, ఉపరితలం, అంతర్గత జలాలు మరియు ఫ్లోరా అండ్‌ పౌనా అనే 5 అంశాలపై తీవ్ర ప్రభావం పడి మొత్తం జీవుల మనుగడ ప్రశ్నార్థంగా మారే అవకాశాలున్నాయని చెప్పారు. ఇప్పటికే కె. తుమ్మలపల్లిలో యురేనియం శుద్ధిలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు పాటించకపోవడంవల్ల ఆ ప్రాంతం మొత్తం జలాల్లో యురేనియం ఉద్గారాలు కలిసి అక్కడి ప్రజలు అనేక వ్యాధుల బారిన పడిన పరిస్థితి చూస్తూనే ఉన్నామని ఆవేదన వ్యక్తం చేశారు. యురేనియం శుద్ధి, దాని సమర్థ నిర్వహణ మరియు సాంకేతిక పరిజ్ఞానంపై ప్రజలకు అవగాహన కల్పించి కేంద్ర ప్రభుత్వం ముందుకెళ్తే బాగుంటుంది.

ఐఖి/-

కుటుంబరావు

ప్రణాళికా సంఘం మాజీ ఉపాధ్యక్షులు

టిడిపి అదికారంలో ఉన్నప్పుడు ఈ పని ఎందుకు చేయలేదు కుటుంబరావు గారు..

tags : kutumbarao

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info