A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
వి.హెచ్,పవన్ కళ్యాణ్ కలిశారు
Share |
February 22 2020, 8:53 pm

నల్లమల అడవుల్లోని అమ్రాబాద్‌ ప్రాంతంలో కేంద్రం తలపెట్టిన యురేనియం తవ్వకాల
వల్ల పర్యావరణం దెబ్బ తినడంతో పాటు జీవవైవిధ్యం నాశనమవుతుందని జనసేన పార్టీ
అధ్యక్షులు పవన్ కల్యాణ్ ఆందోళన వ్యక్తం చేశారు. యురేనియం తవ్వకాల
వల్ల రాడాన్ అనే అణుధార్మిక వాయువు వెలువడుతుందని, దానిని పీల్చిన వారికి
ఊపిరితిత్తుల క్యాన్సర్, యురేనియం వ్యర్ధాలు కలిసిన నీళ్లు తాగడం వల్ల
మూత్రపిండాల సమస్యలు తలెత్తే ప్రమాదం ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. సోమవారం
హైదరాబాద్ లోని జనసేన పార్టీ కార్యాలయంలో కాంగ్రెస్ సీనియర్ నాయకులు వి.
హనుమంతరావు పవన్ కల్యాణ్ ను కలిశారు. నల్లమల అడవుల్లో యురేనియం
తవ్వకాలకు వ్యతిరేకంగా మద్దతు ఇవ్వాలని కోరారు. ఈ సందర్భంగా శ్రీ పవన్ కల్యాణ్
గారు మాట్లాడుతూ.. ;యురేనియం తవ్వకాల వల్ల రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకు ముప్పు
వాటిల్లుతుంది. కృష్ణా జలాలు కలుషితమవుతాయి. గర్భిణులు ఆ కలుషిత నీరు తాగితే పుట్టే
బిడ్డ మానసిక వైకల్యానికి గురయ్యే ప్రమాదం ఉంది. రేడియేషన్‌తో మహిళల్లో
గర్భసంచి సమస్యలు తలెత్తుతాయి. ఈ విషయం చాలా మంది చెంచులు జనసేన పార్టీ దృషికి
తీసుకొచ్చారు. వీటిని దృష్టిలో పెట్టుకొని యురేనియం తవ్వకాల వల్ల ఎలాంటి నష్టం
వాటిల్లనుంది..?. కృష్ణా జలాలు ఎలా కలుషితం కాబోతున్నాయి..?. ఆ నీరు తాగిన ప్రజలకు
ఎలాంటి జబ్బులు రాబోతున్నాయి..?. అన్నదానిపై అఖిలపక్ష సమావేశం నిర్వహించి
పర్యావరణ శాస్ర్తవేత్తలు, నిపుణులతో మాట్లాడి ప్రజల్లోకి వెళ్తాం. రౌండ్
టేబుల్ సమావేశం ఎప్పుడు నిర్వహించేది రెండు, మూడు రోజుల్లో తెలియజేస్తామ;న్నారు.
కాంగ్రెస్ సీనియర్ నేత శ్రీ వి. హనుమంతరావు గారు మాట్లాడుతూ.. యురేనియం సమస్య
రెండు తెలుగు రాష్ట్రాల సమస్య. యురేనియం శుద్ధి చేయగా వచ్చిన వ్యర్ధాలు కృష్ణా
నదిలో కలవడం వల్ల రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలు అనారోగ్య సమస్యలకు గురవుతారు.
కిడ్నీ, క్యాన్సర్ వ్యాధులతో పాటు పిల్లలు మానసిక రోగులుగా మారుతారు. నల్లమలలో
జీవవైవిధ్యం దెబ్బతింటుంది. జంతువులు మృత్యువాత పడతాయి. చెంచుల జీవితాలు
అస్తవ్యస్థం అవుతాయి. యురేనియం తవ్వకాలు జరిగిన ప్రాంతాల్లో పంటలు పండవు, నీళ్లు
వ్యవసాయానికి యోగ్యం కావు, భూగర్భజలాలు అడుగంటిపోతాయి. కడప, జార్ఖండ్
ప్రాంతాల్లో ఇలానే జరిగింది. ప్రజా సమస్యలపై పోరాటం అంటే ముందుండే నాయకుడు శ్రీ
పవన్ కల్యాణ్ గారు. అందుకే ముందుగా ఆయన్ను కలసి పోరాటానికి మద్దతు అడిగాను.
సానుకూలంగా స్పందించి అఖిలపక్షం పిలుద్దాం. నిపుణులతో మాట్లాడి జరగబోయే నష్టాలను
ప్రజలకు వివరిద్దాం అని చెప్పారు. మరో రెండు మూడు రోజుల్లో సెమినార్ ఎప్పుడు
నిర్వహిస్తామనే డేట్ వెల్లడిస్తాం. అన్ని పార్టీల నాయకులం చర్చించి కేంద్ర,
రాష్ట్ర ప్రభుత్వాలపై ఒత్తిడి తీసుకొచ్చి యురేనియం తవ్వకాలను అడ్డుకుంటామ;ని
అన్నారు.

tags : pawankalyan

Latest News
*మాజీ మంత్రుల ప్రమేయం స్కామ్ లో ఉంది
*చంద్రబాబు ఇలా మాట్లాడుతున్నారేమిటి-విజయసాయి
*ట్రంప్ కు రాష్ట్రపతి విందు- కెసిఆర్ కు ఆహ్వానం
*సిట్ కు భయపడబోం- తెలుగుదేశం
*తెలంగాణలో దోషులపై చర్యలు తీసుకున్నట్లే..
*కర్నాటకలో పాలనా వికేంద్రీకరణ
*అచ్చెన్నాయుడి అవినీతి బట్టబయలు
*సి.ఎమ్. కప్ పేరుతో క్రీడా పోటీలు- అవంతి
*చంద్రబాబు మనుమడికి హెరిటేజ్ షేర్లు ఎలా వచ్చాయి
*రాజమండ్రి- విజయనగరం- కొత్త జాతీయ రహదారి
*సుజనా ఇన్ సైడ్ ట్రేడింగ్- సిబిఐ కి బ్యాక్ ఫిర్యాదు
*చంద్రబాబు ప్రభుత్వ అవినీతిపై 'సిట్" ఏర్పాటు
*ట్రంప్ కోసం కోటి మంది రావాలంటే..వర్మ సలహా
*అక్రమాలపై దర్యాప్తు శిక్ష ఎలా అవుతుంది
*రెచ్చగొడుతూ లోకేష్ సవాల్ చేస్తున్నారా
*సిట్ పై నమ్మకం లేదన్న టిడిపి ఎమ్.పి
*అవినీతి ఆరోపణలు వస్తే కులం రంగు వేస్తారా
*కాంగ్రెస్ ను అదికారంలోకి తెస్తాం
*;పాకిస్తాన్ జిందాబాద్ అంటే స్పందించరే
*అచ్చెన్నాయుడును అరెస్టు చేయాలి
*60 కోట్లతో సినిమా తీస్తున్నా-మోహన్ బాబు
*రాయపాటి కి మరిన్ని చిక్కులు వస్తాయా
*రాయలసీమ లో ప్రాజెక్టుకు ప్రపంచ బ్యాక్ రుణం
*సిట్ కు విశేష అదికారాలు ఇచ్చిన ఎపి ప్రభుత్వం
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info