A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
జగన్ కు పస్ట్ కాస్....కాని డిస్టింక్షన్ రావాలి
Share |
September 23 2019, 1:53 am

కాలచక్రం గిర్రున తిరుగుతోంది.అప్పుడే వైఎస ఆర్ కాంగ్రెస్ అదినేత జగన్ వంద రోజుల పాలన పూర్తి అయిపోయింది. ఇప్పుడు ఆయన వంద రోజుల పాలనపై సమీక్షలు,విశ్లేషణలు సాగుతున్నాయి. ఈ వంద రోజుల పాలన అన్నది కేవలం ఒక సూచిక మాత్రమే. అసలు పాలన చాలా ఉంది.ఇంకా నాలుగున్నర్ర సంవత్సరాలపాటు సాగవలసి ఉంది.ఆ తర్వాత ప్రజలు మళ్లీ తమ నిర్ణయం తెలియచేస్తారు. అలా అని ఈ మూడునెలల్లో జరిగినదానిని విశ్లేషించుకోవడం తప్పు కాదు. నిజానికి ప్రభుత్వంలో ఉన్నవారు ఒకసారి సమీక్షించుకోవడం కూడా మంచిదే. ఈ మూడు నెలల పది రోజులలో ముఖ్యమంత్రిగా జగన్ అనేక నిర్ణయాలు చేశారు.వాటిలో జనరంజకమైనవి ఉన్నాయి.కొన్ని జనానికి ఇబ్బంది కలిగించేవి కూడా ఉండవచ్చు. అయినా స్థూలంగా ప్రజలకు మేలు చేశారా?లేదా?తాను ఎన్నికల ప్రణాళికలో పెట్టిన వాగ్దానాలను అమలు చేసే దిశలో ఉన్నారా?లేదా ?అవినీతి రహితంగా పాలన నడుస్తోందా?లేదా తదితర విషయాలు కీలకం అవుతాయి.నిజానికి అందరిని సమానంగా చూడండి, మా పార్టీ వాళ్లు తప్పు చేసినా చర్య తీసుకోండి అని ఒక ముఖ్యమంత్రి చెప్పడమే ధైర్యంతో కూడిన పని అని అంగీకరించాలి.గత ప్రభుత్వ అదినేత గా చంద్రబాబు నాయుడు తమ పార్టీవాళ్లు పనులు అడిగితే చేయాలని, రాజకీయంగా తమకు ఉపయోగం అవ్వాలని కలెక్టర్ ల సమావేశంలోనే చెప్పారు.అంతేకాదు. చంద్రబాబు తాను మొదటగా సంతకాలు చేసిన వాటిలో ఒక ఉద్యోగుల రిటైర్ మెంట్ వయసు మినహా ఏవీ సరిగా అమలు కాలేదు. మరో వైపు జగన్ చేసిన సంతకాలు అమలు అవుతున్నాయి.మూడు నెలల కాలంలో ఎక్కడా అవినీతికి ఆస్కారం లేకుండా ఆయన పాలన సాగించడం గొ్ప్ప సంగతి .ప్రస్తుత ఎన్నికల రాజకీయాలలో అలా ఉండగలగడం అంత తేలికైన సంగతి కాదు. ఎన్నో ఒత్తిడులను ఆయన ఎదుర్కోవలసి ఉంటుంది.ఒకరద్దరు మంత్రులు,ఎమ్మెల్యేలు పోలీసు అదికారుల బదిలీలలో డబ్బు తీసుకున్నారన్న సమాచారం రావడంతోనే ఆయన వారిని పిలిచి మందలించారని వార్తలు వచ్చాయి. వెంటనే వారు ఆ డబ్బు తిరిగి ఇచ్చేశారని కూడా అంటారు.ఈ మద్యకాలంలో ఇలాంటివి వినడం ఇదే అని చె్ప్పాలి. మద్య నిషేధం దిశగా అడుగులు వేస్తామని చెబుతూ ముందుగా 800 షాపులు తగ్గించారు. ప్రభుత్వమే షాపులను నిర్వహించడానికి చర్యలు తీసుకున్నారు.వృద్దాప్య పెన్షన్లు రెండువేల నుంచి 2250 రూపాయలకు పెంచి అమలు చేయడం ఆరంభించారు.ఆశావర్కర్ల జీతాలు పెంచారు. రైతు బరోసా,అమ్మ ఒడి వంటి వాటిని అమలు చేయడానికి షెడ్యూల్ ను ఆయన ప్రకటించారు.ఇలా గతంలో ఏ ముఖ్యమంత్రి చేయలేదన్నది వాస్తవం, రివర్స్ టెండరింగ్, ప్రభుత్వ పదవులు, కాంట్రాక్టులలో ఏభై శాతం బలహానవర్గాలకు కేటాయిస్తూ చట్టం తీసుకురావడం, స్థానికులకు డెబ్బై ఐదు శాతం ఉద్యోగాలు ఇవ్వాలని చట్టం తేవడం ఇలా మానిపెస్టోలని అంశాలపై చర్యలు తీసుకున్నారు. దేశ చరిత్రలోనే ఎన్నడూ లేని విధంగా వైఎస్ ఆర్ కాంగ్రెస్ మానిపెస్టోని తన తో సహా మంత్రుల వద్ద,అదికారుల వద్దపెట్టి వీటిని అమలు చేయాలని చెప్పి జగన్ కొత్త అద్యాయానికి శ్రీకారం చుట్టారు.గతంలో ఏ ప్రభుత్వం ఇంత ధైర్యంగా ఇలా చేయలేదు. గత టరమ్ లో పాలించిన టిడిపి అయితే తన మానిఫెస్టోని పార్టీ వెబ్ సైట్ నుంచి తీసేసింది.ఎందుకంటే అందులో కొన్ని వంందల ఆచరణ సాద్యకాని హామీలు ఇచ్చింది కనుక. వాటిని ఆయా రాజకీయ పార్టీలు,ప్రజలు ప్రశ్నిస్తారని ఆ విదంగా చేశారు.ఆర్టిసిని ప్రభుత్వంలో విలీనం చేయడానికి ఓకే చేయడం కూడా సంచలనమే.ప్రత్యేక హోదా ఉద్యమకారులపై పెట్టిన కేసులను ఎత్తివేస్తూ తీర్మానం చేశారు. గ్రామ సచివాలయ వ్యవస్థ,వలంటీర్ల వ్యవస్థకు శ్రీకారంచుట్టారు. ఇది కొత్త ప్రయోగం. ఇది సజావుగా జరిగితే ఓకే.లేకుంటే కొత్త సమస్యలలోకి వెళ్లే అవకాశం ఉంటుంది. గిరిజన ప్రాంతాలలో సూపర్ స్పెషాటిలి ఆస్పత్రులు నెలకొల్పడం,పలాసలో డయాలిసిస్ కేంద్రం, 200 పడకల ఆస్పత్రి ఏర్పాటు తదితర నిర్ణయాలు చేశారు. అగ్రిగోల్డ్ బాదితులకు డబ్బు చెల్లించాలని కూడా తీర్మానం చేశారు. అయితే నిర్ణయాలు జరిగినంతమాత్రాన ఇవన్ని అయిపోతాయని కాదు..ఇందుకు చాలా డబ్బు కావాలి. నలభై ఏళ్ల పరిశ్రమ అని చెప్పుకునే చంద్రబాబు నాయుడు ఖజానాలో వంద కోట్లు మాత్రం మిగిల్చి వెళ్లారు. అంతేకాక లక్షన్నరకోట్ల అప్పు కూడా పెట్టి వెళ్లారు. ఈ సంక్షేమ కార్యక్రమాలతో పాటు అబివృద్ది పనులు కూడా జరగాలి. ఎక్కడా సమతుల్యత దెబ్బతినకూడదు. మరో వైపు గత ప్రభుత్వంలో జరిగిన అనేక అవినీతి ,అక్రమాలపై కమిటీలు వేసి నివేదికలు తెప్పిస్తున్నారు.వాటిపై ఎంతవరకు ముందుకు వెళతారో తెలియదు కాని వాటిలోని అంశాలు ,గత ఐదేళ్లలో జరిగిన అవినీతి అందరికి దిగ్బ్రమ కలిగించేవే. పోలవరం ప్రాజెక్టులో 2300 కోట్లకు పైగా అవినీతి జరిగిందని నిపుణుల కమిటీ తేల్చింది.దాని ఆధారంగా కాంట్రాక్టును రద్దు చేశారు. అయితే దీనిపై కేంద్రంలో టిడిపి మేనేజ్ చయడం వల్లకాని, ఇతరత్రా కాని కొంత వ్యతిరేక వ్యాఖ్యలు రావడం ఎపి ప్రభుత్వానికి చికాకు కలిగించేదే. హైకోర్టు కూడా అనుకూల తీర్పు ఇవ్వలేదు.అయినా అదే క్రమంలో ముందుకు వెళ్లాలని నిర్ణయించుకున్నారు.నవంబర్ ఒకటి నుంచి పనులు ఆరంభించి రెండేళ్లలో పూర్తి చేస్తామని ప్రభుత్వం చెబుతోంది. వైఎస్ రాజశేఖరరెడ్డి కృషి వల్ల ఆరంభమైన ఈ ప్రాజెక్టు ఎపికి ఎంతో కీలకం.అంతేకాదు..జగన్ కు కూడా ప్రతిష్టాత్మకం. రివర్స్ టెండరింగా?మరొకటా అన్నది ఇక్కడ ప్రజలకు అప్రదానం.అంతా కోరుకునేది ప్రాజెక్టు పూర్తి కావడం అన్న సంగతిని జగన్ గుర్తించాలి.సకాలంలో ప్రాజెక్టు పూర్తి కాకపోతే జగన్ కు రాజకీయంగా నష్టం జరుగుతుందన్న విషయాన్ని మర్చిపోరాదు. పలు ప్రాజెక్టు పనుల టెండర్లలో అవినీతిని దృష్టిలో పెట్టుకుని వాటిని కూడా రద్దు చేసి రివర్స్ టెండరింగ్ కు వెళుతునారు. మరొక ముఖ్యమైన అంశం.రాజధాని.దానిపై ప్రతిపక్షం ఎంత రాద్దాంతం చేస్తోందో చూస్తున్నాం.మునక ప్రాంతంలో రాజధాని భవనాల నిర్మాణం ప్రారంబించిన మాట వాస్తవం. దానిని చంద్రబాబు రియల్ ఎస్టేట్ వెంచర్ గా చూశారన్నది నిజం. అన్ని నగరాలు ఒకే చోట అంటూ కేంద్రీకృతం అవడం రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలకు నచ్చలేదు. పవన్ కళ్యాణ్ వంటివారు ఈ విషయంలోమాట మార్చి ఉండవచ్చు. అయితే రాజధానిని మార్చుతారని ఎవరూ అనుకోవడం లేదు. ఇది రాష్ట్ర ప్రజల నెత్తిన ఒక పెద్ద కొండగా మారింది. ప్రభుత్వానికి గుదిబండగా ఉంది. దానిని పట్టుకుని కూర్చోలేరు. తీసేయలేరు. కాని ఏదో ఒక విధానంతో ముందుకు వెళ్లాలి.ఏభై వేల ఎకరాలలో రాజదాని కడతానని ఎవరు చెప్పినా అది తెలివి తక్కువ తనమే అవుతుంది.అయితే ఎటూ భూములు తీసుకున్నారు కాబట్టి వాటిని ఎలా వాడుకోవాలన్నదానిపై ఆలోచన జరగాలి.అందుకోసం వేల కోట్ల రూపాయలు ఖర్చు చేయడం సాధ్యం కాకపోవచ్చు.కాని మినిమమ్ వ్యయంతో ఎక్కువ ప్రయోజనం చేకూరేలా నిర్ణయాలు చేయడం బెటర్ .అలాగే గత ప్రభుత్వం ప్లాన్ చెసిన స్పోర్స్ట్ సిటీ, హెల్త్ సిటి,అంటూ రకరకాల నగరాల కాన్సెప్ట్ లను ఇతర జిల్లాలకు కూడా మార్చి అన్ని ప్రాంతాలు అబివృద్ది జరిగేలా చూడాలి.ఇక మీడియా పరంగా జగన్ ప్రభుత్వం పెద్ద శ్రద్ద తీసుకుంటున్నట్లు కనపడడం లేదు. గతంలో మాదిరే తెలుగుదేశం మీడియా ఆయనపై ఎక్కడ అవకాశం వచ్చినా వ్యతిరేకత పెంచడానికి ప్రయత్నిస్తోంది.టిడిపి వారి విమర్శలకే అత్యదిక ప్రాదాన్యత ఇస్తోంది.ఇసుక విషయంలోనే ప్రభుత్వం ఎక్కువ విమర్శలు ఎదుర్కుంది. అయితే కొత్త ఇసుక విధానం అమలులోకి వచ్చినందున ఆ సమస్య తొలగిపోవచ్చు.కాగా జగన్ ఇతర పక్షాల నేతలకు,ప్రజా ప్రతినిదులకు ఇంకా అప్పాయింట్ మెంట్ లు ఇవ్వడం లేదని ,ప్రజలను కలుసుకునే ఏర్పాటు జరగలేదన్న వ్యాఖ్యలు ఉన్నాయి. కొద్ది రోజులలో మొదలైతే అవి కూడా తగ్గుతాయి.తెలంగాణతో సఖ్యత,కేంద్రంతో సత్సంబంధాలు, కెసిఆర్ ,మోడీలతో స్నేహం ఇవన్ని సానుకూల అంశాలే.అయితే ప్రాంతీయ భావాలు, మత పరమైన అంశాలు ఎంతో సున్నితమైనవి.ప్రత్యర్దులు ఎక్కడ అవకాశం దొరుకుతుందా అని కాచుకు కూర్చున్నారు.దానికి ఉదాహరణ ఆర్టిసి బస్ టిక్కెట్ల వెనుక అన్యమత ప్రచారం వ్యవహారమే. అది చేసింది టిడిపి హాయంలో అయినా జగన్ ప్రభుత్వానికి బురదరాసే ప్రయత్నం జరిగింది. స్థూలంగా చూస్తే జగన్ ఈ మూడు నెలల్లో ఫస్ట్ క్లాస్ లో పాస్ అయ్యారని అంగీకరించవచ్చు. కాని ప్రజలు ఆయన డిస్టింక్షన్ లో ఉండాలని అబిలషిస్తారు.
కనుక సంక్షేమాన్ని,అబివృద్దిని సమపాళ్లలో చేసుకుంటూ ముందుకు వెళ్లడానికి ఈ మూడు నెలలు ఆయన పునాది వేసుకున్నారని అనుకోవాలి.ఈ పునాది బాగా బలపడి ,ప్రజలలోకి ఈ ఫలాలు వెళ్లడం మొదలైతే ,అప్పుడు జగన్ డిస్టింక్షన్ మార్కలు వస్తాయి.

tags : jagan, distinction

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info