A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
బాబు సూపర్ ప్రధానిగా ఊహించుకునేవారు
Share |
September 23 2019, 2:08 am

ఎపి మాజీ ముఖ్యమంత్రి, ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడుపై మాజీ మంత్రి దాడి విరభద్రరావు విమర్శల వర్షం కురిపించారు. ఎపి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు తనను తాను సూపర్ ప్రధానిగా ఊహించుకుని ప్రత్యేక విమానాలలోనే తిరిగారని ఆయన ఎద్దేవ చేశారు.ముఖ్యమంత్రి జగన్ పాలన గురించి మాట్లాడే అర్హత చంద్రబాబుకు లేదని ఆయన అన్నారు. ఓటమికి కారణం తన విధానాలు కాకుండా ప్రజలదే తప్పనే నియంత చంద్రబాబు అని విమర్శించారు. రాజధానిలో రైతుల నుంచి భూములు సేకరించి తన అనుచరులకు ధారాదత్తం చేయడం న్యాయమేనా? అని ప్రశ్నించారు. అధికారంలో ఉన్నప్పుడు సూపర్‌ ప్రధానిగా భావించుకొని ప్రత్యేక విమానాల్లో తిరిగిన బాబు సాధించిందేమీ లేదని పేర్కొన్నారు. మోదీ వ్యతిరేక సభల పేరుతో రాష్ట్రమంతా సభలు పెట్టి ప్రజా ధనాన్ని దుర్వినియోగం చేశారని ఆయన అన్నారు. సీఎం జగన్‌ అధికారంలోకి వచ్చిన మూడు నెలల్లోనే పార్టీ మేనిఫెస్టోని 90 శాతం అమలు పరిచి ప్రపంచ రికార్డు సాధించారని ప్రశంసించారు.

tags : dadi

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info