A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
లోకాయుక్తగా జస్టిస్ లక్ష్మణరెడ్డి
Share |
September 23 2019, 2:34 am

ఎపి లోకాయుక్త గా రిటైర్డ్ జడ్జి జస్టిస్ పి.లక్ష్మణరెడ్డి నియమితులయ్యారు. ఐదేళ్ల పాటు ఆయన ఈ పదవిలో ఉంటారు. జస్టిస్‌ పి.లక్ష్మణ్‌రెడ్డి గతంలో ఏపీ ఉమ్మడి హైకోర్టు జడ్జిగా పనిచేశారు. లోకాయుక్త నియామకంతో పెండింగ్‌ కేసుల పరిష్కారం వేగవంతం కానున్నాయి. ఇటీవల తీసుకొచ్చిన లోకాయుక్త సవరణ చట్టం ప్రకారం హైకోర్టు విశ్రాంత ప్రధాన న్యాయమూర్తి లేదా విశ్రాంత న్యాయమూర్తిని లోకాయుక్తగా నియమించుకునే వెసులు బాటు ప్రభుత్వానికి ఉంది. లక్ష్మణ్‌రెడ్డిని లోకాయుక్తగా నియమిస్తూ ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చింది. రాయలసీమ తో ఎపికి సంబందించిన వివిధ అంశాలపై గత మూడేళ్లుగా ఆయన వివిధ కార్యక్రమాలలో పాల్గొన్నారు.

tags : lakshmanreddy, rtd,judge

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info