A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
పెయిడ్ ఆర్టిస్టులతో చంద్రబాబు శిబిరాలు
Share |
September 23 2019, 2:35 am

తెలుగుదేశం పార్టీ పెయిడ్ ఆర్టిస్టులతో పునరావాస శిబిరం నడుపుతోందని హోం మంత్రి సుచరిత వ్యాఖ్యానించారు.ముఖ్యమంత్రి జగన్ పాలనతో రాష్ట్రం ప్రశాంతంగా ఉండడం ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడుకు ఇష్టం లేదని ఆమె అన్నారు. వర్షాలు పడి రైతులు, రైతు కూలీలు పనుల్లో నిమగ్నమై.. నిరుద్యోగులు పోటీ పరీక్షలు రాస్తూ రాష్ట్రమంతా ప్రశాంతంగా ఉంటే చంద్రబాబుకు నచ్చడం లేదని ఆమె అన్నారు. అందుకే పల్నాడులో పెయిడ్‌ ఆర్టిస్టులతో శిబిరాలు పెడుతూ ప్రశాంతతకు భంగం కలిగించాలని చూస్తున్నారని మండిపడ్డారు. 2014 నుంచి 2019 వరకు రాష్ట్రంలో రాక్షస పాలన జరిగిందని హోం మంత్రి సుచరిత విమర్శించారు. టీడీపీ నేత యరపతినేని అక్రమ మైనింగ్‌ గురించి ఫిర్యాదు చేసినందుకు గురువాచారి అనే వ్యక్తిని దారుణంగా హింసించారన్నారు.

tags : sucharita

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info