A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
jకెసిఆర్ బొమ్మ బదులు సుదర్శన చక్రం
Share |
September 23 2019, 2:21 am

యాదాద్రి ఆలయం స్తంభాలపై ముద్రించిన ముఖ్యమంత్రి కెసిఆర్ బొమ్మలను తొలగించారు. వాటితో పాటు రాజకీయంగా విమర్శలు వచ్చిన కారు తదితర గుర్తులను కూడా తొలగించారు.ముఖ్యమంత్రి కార్యాలయం ఇచ్చిన ఆదేశాల మేరకు దైవ సంబంద బొమ్మలు మినహా మిగతా ఏ రకమైన చెక్కడాలు ఉండకుండా చెరిపివేసినట్లు ప్రధాన ఆర్కిటెక్ట్ ఆనందాచారి చెప్పారు.ఆలయ ప్రాకార మండపంలో రాజకీయ అంశాలకు చెందిన బొమ్మల చెక్కడంలో ఎవరి ప్రమేయం లేదని.. ఒక శిల్పి తన సొంత నిర్ణయంతో చేసింది మాత్రమేనని పేర్కొన్నారు. ఆ చిత్రాలను తొలగించామని.. ఇక పూర్తిగా దైవ సంబంధిత చిత్రాలు మాత్రమే ఉంటాయని స్పష్టం చేశారు. తొలగించిన బొమ్మల స్థానంలో లతలు, పద్మాలు, హంసలతో పాటు దైవ సంబంధమైన బొమ్మలను చెక్కడానికి మార్కింగ్‌లైన్లు వేశారు. కేసీఆర్‌ చిత్రం ఉన్న రాతిస్తంభంపై సుదర్శన చక్రం చెక్కనున్నారు.

tags : kcr,yadadri

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info