A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
తెలంగాణ సంపద 8 లక్షల కోట్లు-కెసిఆర్
Share |
September 23 2019, 2:38 am

2014 లో ఏర్పడిన తెలంగాణ అద్బుతమైన ప్రగతి సాధించిందని ముఖ్యమంత్రి కెసిఆర్ అన్నారు. బడ్జెట్ ను ఆయన ప్రవేశ పెట్టారు.రాష్ట్రం ఏర్పడిన మొదటి సంవత్సరం నెలకు ఆరువేల కోట్లకుపైగా వ్యయం చేసి పరిస్తితి నుంచి ఇప్పుడు పదకుండువేల కోట్లకు పెరిగిందని ఆయన చెప్పారు. వృద్ది రేటు అప్పట్లో నాలుగున్నర శాతం కాగా, అది రెండున్నర రెట్లు పెరిగి 10.5 శాతంగా ఉందని ఆయన అన్ఆనరు. మూల దన వ్యయం కూడా బాగా పెరిగిందని ఆయన అన్నారు. సమైక్య రాష్ట్రంలో మూల దన వ్యయం 45 వేల కోట్లు కాగా, తెలంగాణ రాష్ట్రంలో లక్షా ఐదువేల కోట్ల రూపాయలు అని ఆయన అన్నారు.తెలంగాణ సంపద ఎనిమిది లక్షల కోట్లకు చేరిందని కెసిఆర్ వివరించారు. దేశంలో అగ్రగామి రాష్ట్రం తెలంగాణ ఉందని ఆయన అన్ఆనరు.ఈ ఐదేళ్లలో పెట్టుబడులు కూడా భారీగా పెరిగాయని అన్నారు. సమర్ధవంతమైన ఆర్దిక క్రమశిక్షణ ను పాటించామని ఆయన చెప్పారు. విద్యుత్ కోతలు లేకుండా చేయడం వల్ల పరిశ్రమలు బాగా పనిచేయగలుగుతున్నాయని కెసిఆర్ తెలిపారు.

tags : kcr, telangana

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info