A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
కాంగ్రెస్ ఎమ్.పి పాదయాత్రకు అనుమతి నో
Share |
January 27 2020, 8:11 am

భువనగిరి కాంగ్రెస్ ఎమ్.పి కోమటిరెడ్డి వెకంటరెడ్డి తలపెట్టిన ఉదయసముద్రం ఎత్తిపోతల పధకం పాదయాత్రకు అనుమతి ఇవ్వడం లేదని నల్లొండ జిల్లా ఎస్పి రంగనాద్ చెప్పారు. రైతు సాదన పాదయాత్ర పేరుతో వెంకటరెడ్డి ఈ కార్యక్రమం తలపెట్టారు. లిప్ట్ ఇరిగేషన్ ను వెంటనే పూర్తి చేయాలని ఆయన డిమాండ్ చేస్తున్నారు.తన పాదయాత్రకు అనుమతి ఇవ్వాలని ఇప్పటికే ఆయన పోలీసు అదికారులకు లేఖ రాశారు.దానికి సమాదానంగా ఎస్పి ప్రకటన చేశారు. హైదరాబాద్‌-విజయవాడ 65వ నెంబర్‌ జాతీయ రహదారిపై రోజూ 40 వేల వాహనాలు తిరుగుతాయని, 26న రద్దీ ఎక్కువగా ఉంటుందని ఎస్పీ పేర్కొన్నారు. బిజీగా ఉండే హైవేపై ఈ నెల 26, 27 తేదీల్లో 36 కిలోమీటర్ల పాదయాత్రకు వెంకట్‌రెడ్డి ప్రణాళిక రూపొందించారు. ప్రజలకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతాయని, అంబులెన్స్‌ సేవలకు అంతరాయం కలిగి సామాన్యుల ప్రాణాలకు ముప్పు ఏర్పడే అవకాశం ఉందని ,అందువల్ల అనుమతి ఇవ్వడం లేదని ఆయన స్పష్టం చేశారు.దీనిపై తాను హైకోర్టుకు వెళతానని కోమటిరెడ్డి అంటున్నారు.

tags : komatireddy

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info