A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
పోలవరం కేంద్రానికి -టిడిపి మీడియా
Share |
January 27 2020, 8:19 am

తెలుగుదేశం మీడియా చేస్తున్న ఒక ప్రచారం ప్రకారం కేంద్ర ప్రబుత్వం నేరుగా పోలవరం ప్రాజెక్టును నిర్మించడానికి చర్యలు చేపట్టవచ్చు. తద్వారా బిజెపి తన ప్రతిష్టను పెంచుకోవడానికి ప్రయత్నాలు చేస్తోందని రాశారు.పోలవరంపై తాజా పరిణామాల నేపద్యంలో కేంద్రం ఈ చర్య తీసుకోవచ్చన్నది సారాంశం.బిజెపి ఎమ్.పి జివిఎల్ నరసింహారావు, ఇతర నేతలు సోం వీర్రాజు, మాణిక్యాలరావు తదితరలు పోలవరంలో నిర్వాసితులతో సమావేశం కావడం, పలు అంశాలు చర్చించడం తదితర అంశాలను ఈ కదనంలో ప్రస్తావించారు. 2013 భూ సేకరణ చట్టం ప్రకారం నిర్వాసిత కుటుంబాలు లక్షా ఆరు వేలకు చేరుకున్నాయి. వీరిలో అర్హులను గుర్తించి వారికే లబ్ధి చేకూర్చడం ద్వారా ఎక్కడా అవినీతికి తావివ్వకుండా ప్రాజెక్టును పూర్తి చేయాలన్న లక్ష్యం కూడా ఆ పార్టీకి ఉందని పార్టీ వర్గాలు చెబుతున్నట్లు రాశారు.

tags : polavraam

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info