A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
రాజదాని ఏ ఒక్క సామాజికవర్గానికో కాదు
Share |
September 23 2019, 2:00 am

రాజదాని అంటే ఏ ఒక్క ప్రాంతానికో,ఏ ఒక్క సామాజికవర్గానికో కాదని మున్సిపల్ మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. తాను బాద్యత కలిగిన మంత్రిగానే ఈ విషయం చెబుతున్నానని ఆయన అన్నారు.అమరావతిలో నిర్మాణ వ్యయం చాలా అదికంగా ఉందని ఆయన నఅ్నారు. రాజధాని అంటే ఏ ఒక్క ప్రాంతానిదో, ఏ ఒక్క పార్టీకో సంబంధించి కాదని ఆయన అన్నా రు. నేను కూడా విన్నాను. ఆ మాటే నేనూ చెబుతున్నాను. రాజధాని అంటే ఏ ఒక్క ప్రాంతానిదో, ఏ ఒక్క పార్టీ దో, ఏ ఒక్క సామాజిక వర్గానిదో కాదు. రా ష్ట్రంలో ఉన్న ఐదు కోట్ల మందికి సంబంధించిన అం శమిదని జనసేన అదినేత పవన్ కళ్యాణ్ కు పరోక్షంగా సమాధానం ఇచ్చారు. రాష్ట్ర విభజన నేపథ్యంలో శివరామకృష్ణన్‌ కమిటీని కేంద్ర ప్రభుత్వం నియమించింది.షాంధ్రప్రదేశ్‌కు రాజధాని లేదు.. దానికి సంబంధించి సలహాలు సూచనలు ఇవ్వడానికి రాష్ట్రమంతా పర్యటించాలని కమిటీకి సూచించింది.అధికారంలోకి వచ్చిన టీడీపీ ప్రభుత్వం, చంద్రబాబు.. ఆ కమిటీ నివేదికకు వీసమెత్తు ప్రాధాన్యం ఇవ్వకుండా.. మంత్రి నారాయణతో ఓ కమిటీని ఏర్పాటు చేసి.. ఈ ప్రాంతాన్ని ఎంపిక చేశాని బొత్స ద్వజమెత్తారు.

tags : botsa

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info