A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
టిజి వెంకటేష్ వాదన ఏమిటంటే..
Share |
January 27 2020, 8:34 am

ఎపి ముఖ్యమంత్రి జగన్ నాలుగు రాజధానులు చేస్తారని ప్రచారం ఆరంబించిన ఎమ్.పి టిజి వెంకటేస్ అందుకు ఒక వాదన సిద్దం చేసుకున్నారు. నలుగురు ఉప ముఖ్యమంత్రులను జగన్ పెట్టుకున్నారని, ఇది ఒక ఆధారమని ఆయన అన్నారు.(జగన్ ఐదుగురికి ఉప ముఖ్యమంత్రి పదవులు ఇచ్చారు.. రాష్ట్రాన్ని నాలుగు ప్రణాళికాబోర్డులుగా విభజించి.. నాలుగు రాజధానులను ఏర్పాటు చేయబోతున్నారని.. అందుకు అనుగుణంగా దేశంలో ఎక్కడా లేని విధంగా నలుగురు డిప్యూటీ సీఎంలను జగన్‌ నియమించుకున్నారని ఆయన అన్నారు. శ్రీకాకుళం-విజయనగరం-విశాఖపట్నం జిల్లాలు విజయనగరం బోర్డులో, ఉభయగోదావరి-కృష్ణా జిల్లాలు (ఇప్పుడున్న అమరావతి సహా) కాకినాడ బోర్డులో, గుంటూరు-ప్రకాశం-నెల్లూరు జిల్లాలు గుంటూరు బోర్డులో, రాయలసీమ 4 జిల్లాలు కడప బోర్డులో ఉంటాయని టీజీ తెలిపారు.ఈ నాలుగు చోట్ల అసెంబ్లీ భవనాలు కట్టవచ్చని, సీఎం జగన్‌ ఎక్కడ కూర్చుంటే అదే రాజధాని అవుతుందని టిజి తెలిపారు. అసెంబ్లీ అంటే కన్వెన్షన్‌ హాలులా కట్టవచ్చని.. అది రూ.20 కోట్లతో కావచ్చు.. 2,000 కోట్లతో కావచ్చని ఆయన అబిప్రాయపడ్డారు. అయితే ఈ విషయంలో మట్టి అంటించుకోవడానికి బీజేపీ సిద్ధంగా లేదని, బిజెపి ముఖ్య నేత తనకు ఈ విషయం చెప్పారని ఆయన అన్నారు.

tags : tg

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info