A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
మాజీ ప్రదాని మన్మోహన్ సింగ్ భద్రత తొలగింపు
Share |
January 27 2020, 9:02 am

మాజీ ప్రధాని,రాజ్యసభ సభ్యుడు మన్మోహన్ సింగ్ కు ఎస్పిజి భద్రతను తొలగించారు. కేంద్ర ప్రభుత్వం ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. అయితే ఆయన జడ్ ప్లస్ బద్రత కొనసాగుతుందని కేంద్ర హోం శాఖ వెల్లడించింది.ప్రస్తుతం ఎస్పీజీ హోదా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి, కాంగ్రెస్ జాతీయాధ్యక్షురాలు సోనియా గాంధీ, రాహుల్‌ గాంధీ, ప్రియాంకా గాంధీ ప్రభృతులకు మాత్రమే ఉంది.భద్రత ప్రమాదం ఎంత ఉందన్న దాని అంచనా పై ఈ భద్రత కల్పిస్తారు. మన్మోహన్ సింగ్ ఎస్పిజి కేటగిరిలోకి రారని బావించడంతో ఆయనకు ఎస్పిజి బదులు జడ్ ప్లస్ సెక్యూరిటీని ఏర్పాటు చేయాలని నిర్ణయించారు.
2014 వరకు మన్మోహన్‌ సతీమణి గురశరణ్‌ సింగ్‌, కుమార్తెలకు ఎస్పీజీ హోదా ఉండేది. తమకు ఎలాంటి భద్రతా అవసరం లేదని మన్మోహన్‌ కుమార్తెలు స్వచ్ఛందంగా వెనక్కి ఇచ్చేశారు. వ్యక్తిగత భద్రత గురించి మన్మోహన్‌కు ఎలాంటి ఆందోళనా లేదని ఆయన సన్నిహితులు చెప్పారు.

tags : manmohan singh

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info