A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
ఈ దుర్మార్గాల నుంచి జగన్ కాపుకాసుకోవల్సిందే
Share |
February 22 2020, 6:44 pm

ఎపి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ని ఎక్కడ అవకాశం వస్తే అక్కడ బదనాం చేయడానికి రాజకీయ పక్షులు అనండి కొన్ని గద్దలు అనండి ఎలా సిద్దంగా ఉన్నారో గమనించారా?బురద అంటించడానికి ఎన్ని కుట్రలు జరుగుతున్నాయో చూస్తున్నారా? ఏదైనా చిన్న విషయం ఉంటే చాలు ఒకపక్క కొన్ని రాజకీయ పక్షాలు, మరో పక్క కొన్ని టీవీ చానళ్లు,పత్రికలు పెద్ద ఎత్తున వ్యతిరేక ప్రచారం చేయడానికి యమా ఉత్సాహపడుతున్నాయి.పోటీపడుతున్నాయి. జగన్ పాలన చేయడమే కాదు.అదికరం వచ్చిన తర్వాత కూడా ఎల్లో మీడియా ద్వేషపూరిత,విషపూరిత ప్రచారాన్ని కూడా ఎదుర్కోవాలి. ఎన్నికల ప్రచారంలోను, పాదయాత్రలోను జగన్ ఎల్లో మీడియా గురించి విస్తృతంగా ప్రసంగించేవారు. అయిన ఆ మీడియా చంద్రబాబుకు భజన చేయడానికి సిగ్గుపడలేదు. తామే చంద్రబాబును గెలిపిస్తామని, జగన్ ను అదికారంలోకి రానివ్వబోమని ఎల్లో మీడియా శపధం చేసినట్లు వ్యవహరించి మొత్తం విలువలను దిగజార్చింది. తాజాగా తిరుమల టిక్కెట్లపై అన్యమత ప్రచారం విషయం చూడండి. ఎక్కడో కొన్ని టిక్కెట్ ల మీద జెరుసలెం, హజ్ యాత్రలకు సంబందించి ప్రచార ప్రకటనలు ఉన్నాయట.అది కనుగొన్నామని శోదించినట్లు బిజెపి వారు ఎంత హడావుడి చేశారు. ఇంకేముంది హిందూమతానికి అపచారం జరిగిపోయిందని గగ్గోలు పెట్టారు. టిడిపి మీడియా లోని ఒక చానల్ అయితే అచ్చంగా జెరుసలెం గురించిఏ ఉన్నట్లు, అదంతా ఇప్పుడే జరిగిందన్న చందంగా ప్రజలను తప్పుదారి పట్టించి ముఖ్యమంత్రి జగన్ ను, వైఎస్ ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అప్రతిష్టపాలు చేసింది. అయితే ముఖ్యమంత్రి కార్యాలయం సకాలంలో స్పందించింది. వెంటనే దానిపై సీరియస్ అయి విచారణ చేయాలని ఆదేశించింది.ఆయా విషయాలపై కూడా ఇలాగే స్పందించడం అవసరమని ఈ ఘటన తెలిపింది. తీరా అన్యమత ప్రచారం గురించి విచారణ చేస్తే, అదంతా తెలుగుదేశం హయాంలో , టిడిపి నేత వర్ల రామయ్య ఆర్టిసి చైర్మన్ గా ఉన్న సమయంలోనే జరిగిందని వెల్లడైంది. అంతే అటు బిజెపి వారు సైలంట్ అయ్యారు. టిడిపి మీడియా కూడా అసలు ఏమీ జరగనట్లు కామ్ అయిపోయాయి.ఈ మద్య కాలంలో మాజీ మంత్రి ,బిజెపి నేత మాణిక్యాలరావు కూడా నోటికి వచ్చినట్లు ఆరోపణలు చేస్తున్నారు.మతపరమైన విమర్శలు చేస్తున్నారు.తద్వారా రాజకీయ లబ్ది పొందాలన్న తాపత్రయంతో బిజెపి నేతలు విలువలు వదలివేస్తున్నారు.మరి ఇంత పెద్ద హిందూ నేతలు గతంలో ఎపి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు బూట్లతో హిందూ దేవుళ్ల పోటోలు పట్టుకుని పూజలు చేయడానికి వెళ్లినప్పుడు ఆయా పూజా సందర్భాలలో బూట్లతో ఉన్నప్పుడు ఎందుకు మాట్లాడలేదు. అంటే అప్పుడు మిత్రపక్షంగా, మాణిక్యాలరావు మంత్రిగా ఉన్నారు కనుక కుక్కిన పేనులా పడి ఉన్నారని అనుకోవాలా? ఒకసారి క్రిస్టమస్ సందర్భంగా చంద్రబాబు ప్రసంగిస్తూ క్రీస్తును నమ్ముకుంటే విజయమేనని బోధ చేసి వచ్చారు.మరి అప్పుడు కూడా ఈ హిందూ మత ఉద్దారకులు కనీసం ప్రశ్నించలేదే?ఇక్కడ పాయింట్ ఏమిటంటే చంద్రబాబు తప్పు చేశారా?లేదా అన్నది చర్చ కాదు. కాని బిజెపి నేతలు, వారికి తోడుగా టిడిపి నేతలు ఎక్కడ అవకాశం వస్తే అక్కడ జగన్ పై మతపరమైన అబియోగాలు మోపాలని, ఆయనేదో హిందూ వ్యతిరేకి అన్న చందంగా ప్రచారం చేయాలని తాపత్రయపడుతున్నారే ..అది దారుణం అని చెప్పడానికి ఈ విషయాలు చెప్పవలసి వస్తోంది. అమెరికాలో జ్యోతి ప్రజ్వలన చేయడానికి జగన్ నిరాకరించారని కూడా ఎపి బిజెపి దుర్మార్గంగా ప్రచారం చేసింది. ఇప్పడు బయటకు వచ్చిన వాటి ప్రకారం ఆర్టిసి టిక్కెట్లపై గత ప్రబుత్వ పదకాల ప్రచారంలో భాగంగా జెరుసలెం,హజ్ యాత్ర, చంద్రన్న దుల్హన్ వంటి ప్రకటనలు ఇచ్చారని, కాంట్రాక్టర్ వాటిని నిర్వహిస్తున్నారని ఆర్టిసి అదికారులు వివరణ ఇచ్చారు. ఒకవేళ పొరపాటున జగన్ అదికారంలోకి వచ్చిన తర్వాత అలా జరిగి ఉంటే ఎంత రచ్చ చేసి ఉండేవారు. మతం అన్నది చాలా సున్నితమైన అంశంగాఉంది. దేశంలో దానిని అడ్డం పెట్టుకుని రాజకీయం చేయడానికి నేతలు సిగ్గపడడం లేదు.గతంలో వైఎస్ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా ఇలాంటి వివాదం సృష్టించడానికి,బిజెపి,టిడిపిలు చేసిన ప్రయత్నం,దానికి ఒక పత్రిక సహకరించిన వైనం నాకు తెలుసు.అప్పుడు ఆ పత్రికలోనే నేను పనిచేసేవాడిని.పంచాయతీరాజ్శాఖవారు ఒక జిఓ ఇచ్చారు. దాని ప్రకారం తిరుమల మీద పంచాయతీ ఎన్నికలు జరపకుండా ఉండడం కోసం కొన్ని చదరపు కిలోమీటర్ల మేర మినహాయింపు ఇచ్చారు. అందులో హిందూ నేతలు కొత్త విషయం కనిపెట్టారు. అది మూడు కొండలే ఉన్నాయని, ఏడుకొండలకు గాను మూడు కొండలు చేశారంటూ దిక్కుమాలిన తప్పుడు ప్రచారం చేశారు.ఆ వార్త వేయడం సరికాదని ఆ కంపెనీ ఎమ్.డి.కి నేను చెప్పాను.కాని టిడిపి ప్రయోజనాలే ఊపిరిగా పనిచేసే ఆయన జర్నలిజం విలువలకు తిలోదకాలు ఇచ్చి ఆ తప్పుడు వార్తను ప్రముఖంగా ప్రచురించారు. విశేషం ఏమిటంటే ఆ జిఓ ఇచ్చిన మంత్రి దివాకరరెడ్డి హిందువు. కాని ఈ మొత్తం ప్రచారాన్ని వైఎస్ కు వ్యతిరేకంగా సందించారు.అంటే రాజకీయం ఎంత దుర్మార్గం ఉంటుంది.రాజకీయ పార్టీలు,పార్టీ ముద్ర లేకుండా పార్టీ కి ప్రచారం చేసే మీడియా అదిపతులు ఎంత దారుణంగా వ్యవహరిస్తారన్నదానికి ఇది ఉదాహరణ.విశాఖలో జిల్లా కలెక్టర్ ఎవరో పాస్టర్ అడిగితే చర్చికి సెక్యూరిటీ ఇవ్వడానికి ఆదేశాలు ఇచ్చారట.వెంటనే దానిని బిజెపి నేతలు పెద్ద సమస్య చేశారు.వెంటనే కలెక్టర్ తేరుకుని అన్ని మతాల ప్రార్దనా స్తలాలకు దానిని వర్తింప చేస్తూ మళ్లీ ఆదేశాలు ఇచ్చారట. వీటన్నికి ఒకటే కారణం కనిపిస్తుంది. సామాజికవర్గాలలో అత్యదిక వర్గాలు జగన్ కు అండగా ఉన్నాయి.అందువల్లే ఏభై శాతం ఓట్లతో ఆయన గెలిచి అదికారంలోకి వచ్చారు.దానిని భగ్నం చేసి, ప్రజలలో మార్పు తేవాలంటే మతపరమైన విష ప్రచారం చేయాలన్నది వీరి వ్యూహం.జగన్ గంగానదిలో పవిత్ర స్నానం చేసినా వీరు గమనించరు. శారదా పీఠంలోను,చినజియ్యర్ స్వామీ వద్ద ఆశీర్వాదాలు తీసుకున్నా ఒప్పుకోరు.ఆయన పలు చోట్ల ఎంత భక్తి ప్రపత్తితో పూజలు చేసినా, అవేమీ తెలుగుదేశం మీడియాకు కనిపించవు.అర్జంట్ గా గతంలో అరాచకాలు చేసిన తెలుగుదేశం పార్టీని మళ్లీ కుర్చీలో కూర్చో పెట్టడం ద్వారా తమ స్వార్ద ప్రయోజనాలను పరిరక్షించుకోవాలన్నదే వీరి లక్ష్యంగా ఉంటుంది.ఈ విషయాలన్నిటిని జగన్ గమనించి అత్యంత మెలకువగా ఉండాలని ఈ అనుభవాలు చెబుతున్నాయి.అందుకే రాజకీయాన్ని నీచంగా మార్చిన కొందరు నేతలు ఎంతకైనా దిగజారుతారన్న విషయాన్ని సదా గుర్తుంచుకుని జగన్ ప్రభుత్వాన్ని ముందుకు తీసుకు వెళ్లాల్సి ఉంటుంది.జగన్ కు ఇది నిత్యం పరీక్షగానే ఉంటుంది. అయినా కొంతకాలం ఈ దుర్మార్గులనుంచి కాపు కాసుకోవల్సిందే.

tags : jagan

Latest News
*మాజీ మంత్రుల ప్రమేయం స్కామ్ లో ఉంది
*చంద్రబాబు ఇలా మాట్లాడుతున్నారేమిటి-విజయసాయి
*ట్రంప్ కు రాష్ట్రపతి విందు- కెసిఆర్ కు ఆహ్వానం
*సిట్ కు భయపడబోం- తెలుగుదేశం
*తెలంగాణలో దోషులపై చర్యలు తీసుకున్నట్లే..
*కర్నాటకలో పాలనా వికేంద్రీకరణ
*అచ్చెన్నాయుడి అవినీతి బట్టబయలు
*సి.ఎమ్. కప్ పేరుతో క్రీడా పోటీలు- అవంతి
*చంద్రబాబు మనుమడికి హెరిటేజ్ షేర్లు ఎలా వచ్చాయి
*రాజమండ్రి- విజయనగరం- కొత్త జాతీయ రహదారి
*సుజనా ఇన్ సైడ్ ట్రేడింగ్- సిబిఐ కి బ్యాక్ ఫిర్యాదు
*చంద్రబాబు ప్రభుత్వ అవినీతిపై 'సిట్" ఏర్పాటు
*ట్రంప్ కోసం కోటి మంది రావాలంటే..వర్మ సలహా
*అక్రమాలపై దర్యాప్తు శిక్ష ఎలా అవుతుంది
*రెచ్చగొడుతూ లోకేష్ సవాల్ చేస్తున్నారా
*సిట్ పై నమ్మకం లేదన్న టిడిపి ఎమ్.పి
*అవినీతి ఆరోపణలు వస్తే కులం రంగు వేస్తారా
*కాంగ్రెస్ ను అదికారంలోకి తెస్తాం
*;పాకిస్తాన్ జిందాబాద్ అంటే స్పందించరే
*అచ్చెన్నాయుడును అరెస్టు చేయాలి
*60 కోట్లతో సినిమా తీస్తున్నా-మోహన్ బాబు
*రాయపాటి కి మరిన్ని చిక్కులు వస్తాయా
*రాయలసీమ లో ప్రాజెక్టుకు ప్రపంచ బ్యాక్ రుణం
*సిట్ కు విశేష అదికారాలు ఇచ్చిన ఎపి ప్రభుత్వం
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info