A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
కెటిఆర్ కు మంత్రి పదవి-పెరుగుతున్న స్వరం
Share |
September 23 2019, 2:20 am

టిఆర్ఎస్ వర్కింగ్ అద్యక్షుడు కెటిఆర్ కు మంత్రి పదవి ఇవ్వాలని టిఆర్ఎస్ లో డిమాండ్ పెరుగుతోంది. కొందరు నేతలు బహిరంగంగానే ఈ డిమాండ్ చేస్తున్నారు. కుకట్ పల్లి ఎమ్మెల్యే మాదవరం కృష్ణారావు ఈ డిమాండ్ చేస్తూ హైదరాబాద్ లో కెటిఆర్ సేవలు అవసరమని అన్నారు.గతంలో మున్సిపల్ మంత్రిగా ఉన్నప్పుడు హైదరబాద్ లో ప్రజలకు ,కార్మికులకు బాగా మేలు జరిగిందని అన్నారు.ఇప్పుడు హైదరాబాద్ ఎన్నికలు కూడా వస్తాయి కనుక కెటిఆర్ కు మళ్లీ మంత్రి బాద్యతలు అప్పగించాలని అన్నారు. వరంగల్ పార్టీ మీటింగ్ లో కూడా నేతలు ఈ అంశం ప్రస్తావించారు.కెటిఆర్ గతంలో అవసరమైన అదికారులతో మాట్లాడి సమస్యలు పరిష్కరించేవారని, ఇప్పుడు కుదరడం లేదని,అందువల్ల కెటిఆర్ కు మంత్రి పదవి ఇవ్వాలని వారు కోరారు.

tags : ktr

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info