A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
జనతా -జనార్దన్ తెలంగాణ ప్రభుత్వ కొత్త యాప్
Share |
September 23 2019, 1:43 am

తెలంగాణ ప్రభుత్వం కొత్త యాప్ ను తీసుకు వస్తోంది.దీని ద్వారా ప్రభుత్వ సేవలు,సమాచారం అందుబాటులోకి తేవాలని ప్రబుత్వ ఆలోచనగా ఉంది.
దేశంలోనే మొదటిసారిగా రాష్ట్ర ప్రభుత్వం వినూత్న పంథాలో తయారుచేసి.. ప్రజలకు అందుబాటులోకి తేబోతున్న ఈ మొబైల్‌ యాప్‌ కు జనతా జనార్దన్‌ అని పేరు పెడుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వ పాలన యంత్రాంగంతో పాటు సమస్త తెలంగాణ ప్రజలకు జనతా జనార్దన్‌ ఉపయుక్తం కానుంది. దీర్ఘకాలిక సమస్యలకు పరిష్కారం లభించనుంది. ప్రస్తుతమున్న వివిధ వెబ్‌సైట్లు, పోర్టళ్లతో అనుసంధానం కానుంది. కేంద్రం ఆమోదిస్తే కేంద్ర వెబ్‌సైట్లకు సైతం అనుసంధానం చేయాలని భావిస్తోంది.ఇందులో ప్రతి వ్యక్తికీ ఒక యునిక్‌ ఐడెంటిటీ కోడ్‌ను ఇచ్చి యాప్‌లోకి ప్రవేశించే అవకాశం కల్పిస్తారు. తన వివరాలను తానే అందులో పొందుపరచవచ్చు. ఒకరి వివరాలు మరొకరు చూడకుండా రక్షణ కల్పించనున్నారు.

tags : telagang janata

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info