A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
సిబిఐ విచారణకు మాజీ సిఎమ్. వెళ్లాల్సిందేనా
Share |
January 27 2020, 9:09 am

కర్నాటక మాజీ ముఖ్యమంత్రి కుమార స్వామికి సిబిఐ చిక్కులు ఎదురు అవుతాయా? కర్నాటకలో జరిగిన ఐ మానిటరింగ్ అడ్వైజరి ( ఐఎమ్ ఎ) స్కామ్ లో ప్రదాన నిందితుడు మన్సూర్ అలీఖాన్ తాను అప్పట్లో 2018 ఎన్నికలకు ముందు కుమారస్వామికి ఐదు కోట్లు ఇచ్చానని పోలీసుల విచారణలో వెల్లడించారు.అదే సమయంలో పోలీస్ కమిషనర్ అలోక్ కుమార్ పాతిక కోట్లు డిమాండ్ చేశారని కూడా ఆరోపించారు.అయితే వీటికి ఆదారాలు సేకరించవలసి ఉంది. పలువురు రాజకీయ నేతలు, బ్యూరోక్రాట్ల పేర్తను ఖాన్ చెబుతున్నాడు.తనను రక్షించుకోవడానికి ఇలా చెబుతున్నారా?నిజంగానే వారందరి ప్రమేయం ఉందా అన్నదానిపై విచారణ జరగవలసి ఉంది.సిట్ సుమారు ఇరవై వేల పేజీల చార్జిషీట్ ను సిద్దం చేసింది.ఈలోగా సిబిఐకి కర్నాటక ప్రభుత్వం అప్పగించింది. దాంతో సంబందిత రికార్డులను సిబిఐకి అందచేయబోతున్నారు. ఆ విచారణ క్రమంలో కుమారస్వామిని సిబిఐ విచారించే అవకాశం ఉందని అంటున్నారు.ఈ సంస్థ వల్ల నలభై వేల మంది కోట్ల రూపాయల మేర నష్టపోయారు.

tags : kumaraswamy

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info