A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
కెసిఆర్ తో చేతులు కాల్చుకోవద్దు
Share |
September 23 2019, 2:08 am

తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ తో జర జాగ్రత్తని రాజ్యసబ సభ్యుడు టిజి వెంకటేష్ ముఖ్యమంత్రి జగన్ కు సలహా ఇచ్చారు. కెసిఆర్ అదికారంలోనే ఎప్పుడూ ఉండాలని ఆలోచిస్తారని, ఆయన ఎజెండాలో ఎవరు బలైనా లెక్కచేయరని టిజి అన్నారు.
చంద్రబాబు, వైఎస్‌, సోనియాగాంధీ.. ఇలా చాలా మంది నేతలు ఆయన్ను నమ్మి చేతులు కాల్చుకున్నారని తెలిపారు. ‘కడుపు నిండిన కేసీఆర్‌ను జగన్‌ ఎంతవరకు నమ్మాలో అంతే నమ్మితే మంచిది. లేనిపక్షంలో కరెంటు దీపం ఆకర్షణకు లోనైన పురుగులా మాడిపోవలసిందే’ అని ఆయన అన్నారు. భవిష్యత్‌లో బీజేపీ-వైసీపీ మధ్య ఎలాంటి సంబంధాలు ఉంటాయో ఎవరూ చెప్పలేరని.. బీజేపీ.. వైసీపీతో జట్టుకట్టి పోటీ చేయొచ్చు.. లేదా మూడో వంతు సీట్ల కేటాయింపుతో టీడీపీతో కలిసి బరిలోకి దిగొచ్చని, ఇప్పుడే ఏ విషయమూ చెప్పలేమని వెంకటేష్ పేర్కొన్నారు.

tags : tg

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info