A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
హైదరాబాద్ లో 66 అంతస్థుల చైనా టవర్
Share |
August 5 2020, 4:32 am

హైదరాబాద్ లో చైనాకు చెందిన ఒక ప్రముఖ సంస్థ 66 అంతస్థుల భవంతిని నిర్మించాలని తలపెట్టింది.ఇందుకు రెండువేల కోట్ల వ్యయం అవుతుందని అంచనా. దీనిలో 58 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణం అందుబాటులోకి వస్తుంది.ఆ సంస్థ అనుమతి కోసం పెట్టుకున్న దరఖాస్తును హెచ్‌ఎండీఏ అధికారులు పరిశీలిస్తున్నారు. వ్యాపార అవసరాల కోసమే బహుళ అంతస్తులను నిర్మించేందుకు ఆయా సంస్థలు ప్లాన్ చేసుకుంటున్నాయి. జీ+4 వరకు షాపింగ్‌ మాల్స్‌, ఫుడ్‌ కోర్టులు, ఆ తర్వాత 30 అంతస్తుల్లో కార్యాలయాలు, ఇంకో 10 అంతస్తుల్లో విలాసవంతమైన కార్యాలయాలు, ఆపైన సర్వీస్‌ అపార్ట్‌మెంట్లు, స్విమ్మింగ్‌ పూల్‌, క్లబ్‌ హౌస్‌, ఆపైన 10 అంతస్తుల్లో స్టార్‌ హోటల్‌ తదితరాలను నిర్మించనున్నట్లుగా సదరు సంస్థ హెచ్‌ఎండీఏకు అందజేసిన దరఖాస్తులో పేర్కొంది. 63వ అంతస్తులో నగర అందాలను వీక్షించేలా ప్రత్యేకంగా స్కైలాంజ్‌ను ఏర్పాటు చేయాలని ప్రతిపాదించారు. గతంలో రిలయన్స్ వారు వంద అంతస్థుల భవనం ప్రతిపాదించారు. కాని రాలేదు. ఇప్పుడు ఇది రావచ్చని ఆశిద్దాం.

tags : tower, hyderabad

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info