A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
పోలవరం అదారిటీకీ ఎపి ప్రభుత్వం జవాబు
Share |
January 27 2020, 8:37 am

పోలవరం అధారిటీకి ఎపి ప్రభుత్వం జవాబు ఇచ్చింది.పోలవరం ప్రాజెక్టు పనులను ప్రక్షాళన చేసి అవినీతిని నిర్మూలించేందుకే రివర్స్‌ టెండర్‌ నోటిఫికేషన్‌ జారీ చేశామని పోలవరం ప్రాజెక్టు అథారిటీ(పీపీఏ)కి తెలిపింది. 2021 నాటికి ప్రాజెక్టును పూర్తి చేసి ఆ ఫలాలను ప్రజలకు ముందుగానే అందించడం కోసం మిగిలిన పనులను పారదర్శకంగా కొత్త కాంట్రాక్టు సంస్థకు అప్పగించడానికే రివర్స్‌ టెండర్‌ నిర్వహిస్తున్నామని తెలిపింది. ప్రస్తుతం రద్దు చేసిన కాంట్రాక్టు ఒప్పందం విలువ ఆధారంగా మిగిలిన పనుల విలువను ఖరారు చేసి దాన్నే అంతర్గత అంచనా విలువ (ఐబీఎం)గా నిర్ణయించి, రివర్స్‌ టెండర్‌ నిర్వహిస్తుండటం వల్ల అదనపు భారం పడదని స్పష్టం చేసింది. టెండర్లపై ఎప్పటికప్పుడు సమాచారం అందిస్తామని, ఈ ప్రక్రియ పూర్తయ్యే వరకూ వేచి చూడాలని కోరింది.

గోదావరికి వరదల వల్ల నవంబర్‌ వరకు ప్రాజెక్టు పనులు చేసేందుకు ఆస్కారం లేదని, సెప్టెంబరులోగా కొత్త కాంట్రాక్టర్‌ను ఖరారు చేసి నవంబర్‌ 1 నుంచి పనులు ప్రారంభిస్తామని, దీనివల్ల ఎక్కడా జాప్యం జరగదని పేర్కొంది. ఈ మేరకు రాష్ట్ర జలవనరుల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్‌ దాస్‌ సోమవారం పీపీఏ సీఈవో ఆర్కే జైన్‌కు లేఖ రాశారు.
దీని ప్రకారం 2018 మార్చి 1 నాటికి పనులు పూర్తి కావాల్సి ఉన్నా కాంట్రాక్టు సంస్థ విఫలమైంది. దీనిపై ఎన్నిసార్లు నోటీసులిచ్చినా ఫలితం లేకపోయిందని ఆ లేఖలో తెలిపారు.

tags : polavaram

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info