A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
ఆర్టిసి విలీనంలో ఇబ్బందులు
Share |
January 27 2020, 9:24 am

ఎపిలో ఆర్టిసి విలీనానికి ఇబ్బందులు ఉన్నాయని నిపుణుల కమిటీ అబిప్రాయపడింది. ముఖ్యంగా కేంద్రం నుంచి అనుమతి తీసుకోవల్సి ఉంటుందని ఆ కమిటీ చెప్పింది.
సీఎం జగన్‌ ఇచ్చిన హామీ మేరకు ఆర్టీసీ సిబ్బంది, కార్మికులను సెప్టెంబరు 16లోపు విలీనం చేయవచ్చని అబిప్రాయపడింది. ఈ ఏడాది జూన్‌ 14న సీఎం ఇచ్చిన హామీ మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఆర్టీసీ విలీన కమిటీ, మంత్రివర్గ ఉపసంఘం మంగళవారం సచివాలయంలో సమావేశమయ్యాయి. ఆర్టీసీ విలీనం అంత సులువు కాదని, కేంద్రం అనుమతి తప్పనిసరని కమిటీ సభ్యులు మంత్రులకు స్పష్టం చేశారు. . కేంద్రం 31శాతం వాటా, రాష్ట్రం 69 శాతం వాటా చేర్చడంతో సంస్థ ఆవిర్భవించింది. దీనిని ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఏకపక్షంగా విలీనం చేయజాలదు. అలా చేస్తే ఏపీఎ్‌సఆర్టీసీ ఆస్తుల నుంచి 31 శాతం వాటా కేంద్రానికి ఇవ్వాలి. ఇప్పుడున్న నష్టాల్లో అది సాధ్యం కాదు. రాష్ట్ర విభజన చట్టంలో పేర్కొన్న విధంగా 9, 10 షెడ్యూళ్లలో సంస్థల ఆస్తుల పంపకాలు ఇప్పటికీ తెలంగాణ ప్రభుత్వంతో కొలిక్కి రాలేదని వారు మంత్రులకు తెలిపారు.

tags : ఇrtc,merger

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info