A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
ఎంటర్ టైన్ మెంట్ మీడియాపై డిజిటల్ మీడియా దెబ్బ
Share |
January 27 2020, 9:32 am

డిజిటల్ మీడియా,సోషల్ మీడియా విస్తారంగా పెరగడంతో ఎంటర్ టెయిన్ మెంట్ వినోద రంగ మీడియా ఎదుగుదల వాగా తగ్గినట్లు వార్తలు సూచిస్తున్నాయి. గత ఏడాది భారత మీడియా వినోద రంగం కేవలం 13 శాతం ఎదుగుదలనే నమోదు చేసింది. మొత్తం మీద 1,63,000 కోట్ల వ్యాపారం చేసినా వృద్ది రీత్యా అంత అదికంగా లేదు. ఈ ఏడాది వృద్ది రేటు పన్నెండు శాతానికి పడిపోవచ్చని అంచనా వేస్తున్నారు. కేపీఎంజీ అధ్యయన నివేదిక వెల్లడించింది. ఆర్థిక వృద్ధి మందగించక పోయి ఉంటే ఈసారి మీడియా, వినోద రంగం మరో 1-2 శాతం అధిక వృద్ధి సాధించి ఉండేదని కేపీఎంజీ పేర్కొంది. ఏప్రిల్‌-జూన్‌ కాలంలో లోక్‌సభ ఎన్నికలు, క్రికెట్‌ ప్రపంచకప్‌ సందర్భంగా అడ్వర్టైజ్‌మెంట్‌ ఆదాయం పెరగకపోయి ఉంటే 12 శాతం వృద్ధి కూడా సాధ్యమయ్యేది కాదని కూడా రిపోర్టు వెల్లడించింది. ఎన్నికలు కాస్త ఉపయోగపడ్డాయన్నమాట.

tags : digital media

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info