A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
హుజూర్ నగర్ ఉప ఎన్నిక అందరికి పరీక్షే
Share |
January 27 2020, 7:36 am

త్వరలో జరగనున్న హుజూర్ నగర్ అసెంబ్లీ ఎన్నిక తెలంగాణలో రాజకీయ పక్షాలకు ఒక పెద్ద సవాల్ అవుతుంది. పిసిసి అద్యక్షుడు ఉత్తం కుమార్ రెడ్డి 2018 అసెంబ్లీ ఎన్నికలలో అక్కడ నుంచి మరోసారి ఎన్నికయ్యారు. ఆయనకు మంచి పట్టున్న ప్రాంతంగా ఈ నియోజకవర్గం ఉంది. అక్కడ ఉత్తం ను ఓడించడానికి టిఆర్ఎస్ చేసిన ప్రయత్నాలు సఫలం కాలేదు. తదుపరి ఆయన లోక్ సభ ఎన్నికలలో పోటీచేసి గెలిచారు. అప్పుడు ఇక్కడ మెజార్టీ వచ్చింది.లోక్ సభకు ఎన్నికవడంతో హుజూర్ నగర్ సీటుకు రాజీనామా చేశారు. దాంతో కాంగ్రెస్ కు, ఉత్తంకు ఇది ప్రతిష్టాత్మక సీటు అవుతుంది. ఎట్టి పరిస్థితిలోను గెలవవలసి ఉంటుంది.అలాగే టిఆర్ఎస్ ఇటివలీకాంలో ఎదుర్కుంటున్న విమర్శల నేపద్యంలో ఆ పార్టీకి కూడా ఇక్కడ గెలుపు కీలకం అవుతుంది.కాగా తెలంగాణలో అదికారంలోకి రవాలన్న తాపత్రయంలో ఉన్న బిజెపి ఇక్కడ బలం పుంజుకోవడానికి అన్ని యత్నాలు చేస్తుంది. గత ఎన్నికలలో కేవలం వెయ్యిలోపు ఓట్లు మాత్రమే బిజెపికి వచ్చాయి. ఈసారి ఈ మూడు పార్టీ లకు ఈ ఉప ఎన్నిక ప్రతిష్టాత్మకం అవుతుంది.

tags : hujurnagar

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info