A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
తప్పుడు వార్తలు ఇస్తున్నారు.. ఎపి సీరియస్
Share |
January 27 2020, 9:15 am

ఎపిలో పరిశ్రమలకు సంబందించి కొన్ని ప్రసార సాదనాలు తప్పుడు వార్తలు ప్రచారం చేస్తున్నాయని ఎపి ప్రభుత్వం ఆగ్రహం వ్యక్తం చేసింది.పెట్టుబడిదారులు రాష్ట్రం నుంచి వెళ్లిపోతున్నట్లుగా కావాలని వార్తలను సృష్టిస్తున్నారని ,అలా దురుద్దేశాలతో వార్తలు ఇచ్చేవారిపై చర్యలు తీసుకుంటామని ప్రభుత్వ పరిశ్రమల శాఖ ముఖ్యకార్యదర్శి ఒక ప్రకటనలో హెచ్చరించారు.ఏసియన్‌ పల్ప్‌ & పేపర్‌ సంస్థ ఏపీని వీడుతున్నట్లు వచ్చిన వార్తలను ప్రభుత్వం ఖండించింది. విషపూరితమైన ఇలాంటి ప్రయత్నాలను గమనిస్తున్నామని, రాష్ట్రానికి పెట్టుబడులు తెచ్చేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని, అవినీతిరహితంగా, పారదర్శక విధానంతో ముందుకెళుతుందని, ఏపీలో పెట్టుబడులు పెట్టేలా వివిధ సంస్థలను ప్రోత్సహిస్తోందని తెలిపింది. ఏసియన్‌ పల్ప్‌ & పేపర్‌ సంస్థ యాజమాన్యంతో ప్రభుత్వం ఎప్పటికప్పుడు చర్చలు జరుపుతోందని ప్రిన్సిపల్ కార్యదర్శి తెలిపారు.

tags : ap,serious

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info