A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
ఈనాడు లోనో ఈ వార్త చూడండి..ఉమా గారూ..
Share |
January 27 2020, 9:20 am

మంత్రులంతా కలిసి సమన్వయంతో పనిచేయడం ద్వారా వరదల నష్టాన్ని తగ్గించగలిగామని మున్సిపల్ శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు.వరద ల వల్ల ఆస్తి,ప్రాణ నష్టం చాలా తక్కువగా ఉండడం కూడా సమన్వయంవల్లే జరిగిందని అన్నారు. ముఖ్యమంత్రి జగన్ విదేశాలలో ఉంటూ సమీక్షలు నిర్వహించారని ఆయన చెప్పారు. కేవలం తెలుగుదేశం వారికి మాత్రమే కడుపు మంటగా ఉందని ఆయన అన్నారు. ప్రజలు ఎవరూ తమకు సాయం అందలేదని పిర్యాదులు చేయకపోయినా, చంద్రబాబుమాత్రం తగుదునమ్మా అంటూ బయల్దేరారని ఆయన అన్నారు. మాజీ మంత్రి దేవినేని ఉమా ఏమి మాట్లాడుతున్నారో, ఆయనకే తెలియడం లేదని, రాయలసీమకు నీరు వెళ్లడం లేదని అబద్దాలు చెబుతున్నారని ఆయన అన్నారు.ఈనాడు పత్రికలోనే కడప జిల్లా లో ప్రాజెక్టులు జలకళ సంతరించుకున్నాయని పోటోలతో సహా వేసిందని, దానిని గుర్తించాలని బొత్స అన్నారు. చంద్రబాబు మాదిరి దుబారా చేయడం లేదని ,అది తమ విదానం కాదని ఆయన అన్నారు.సంక్షోభాన్ని అవకాశంగా మార్చుకోవడం చంద్రబాబు వైఖరి అయితే, ప్రజలను ఆదుకోవడం తమ విదానమని ఆయన అన్నారు.

tags : botsa

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info