A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
టిడిపి నేతలకు బిజెపి షెల్టర్ జోన్ గా మారింది
Share |
August 21 2019, 5:55 pm

రాష్ట్రంలోని బీజేపీ నాయకత్వం చంద్రబాబు సృష్టించిన ట్రాప్‌లో పడినట్లుగా కనిపిస్తోందని వైఎస్సార్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, అధికార ప్రతినిధి సి. రామచంద్రయ్య విమర్శించారు. బీజేపీ నిర్మాణాత్మకంగా వ్యవహరించి, రాష్ట్రాభివృద్ధికి తగిన సలహాలు, సూచనలు ఇస్తే స్వీకరిస్తామన్నారు. చంద్రబాబు ఏది మాట్లాడితే వారూ అదే మాట్లాడితే ప్రజలు ఎలా నమ్ముతారని ప్రశ్నించారు. వైఎస్సార్‌ సీపీ అధికారంలోకి వచ్చి 75 రోజులు మాత్రమే అయిందని, ఈ దశలోనే ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉందన్నారు. బాబు పాలన తమకు వారసత్వంగా వచ్చిందని, దివాళా తీసిన ప్రభుత్వాన్ని తాము చేపట్టామని చెప్పారు.చంద్రబాబు కాంట్రాక్టర్లు, కార్పొరేట్‌ శక్తులకు ప్రతినిధి అయితే.. జగన్‌ ప్రజలకు మాత్రమే ప్రతినిధి అన్నారు. దేశ ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని ఆర్టికల్‌ 370 రద్దుకు తాము మద్దతు ఇచ్చామని, రాష్ట్ర ప్రయోజనాలు దృష్టిలో పెట్టుకుని బీజేపీ తమ ప్రభుత్వానికి మద్దతు ఇవ్వాలన్నారు. రాష్ట్రంలో అభివృద్ధి ఆగిపోలేదని, బాబు దోపిడీ మాత్రమే ఆగిపోయిందన్నారు. టీడీపీ ఎంపీలను బీజేపీలోకి పంపిందే చంద్రబాబని, తద్వారా జైళ్లకు పోకుండా ఒకరినొకరు కాపాడుకునే ప్రయత్నం చేశారన్నారు. టీడీపీ నేతలకు బీజేపీ షెల్టర్‌ జోన్‌లా తయారైందని చెప్పారు.

tags : cr

Latest News
*ఇడుపుల పాయకు రాజదాని తీసుకెళ్తే ఊరుకోం
*రివర్స్ టెండరింగ్ -మోడీ,అమిత్ షా లు ఓకే
*చిదంబరానికి రాహుల్ మద్దతు
*తిరుపతిని రాజధాని చేయాలంటున్న నేత
*సుప్రింలో ఊరట దక్కని చిదంబరం
*ఎపిలో కొత్త చరిత్ర -మంచిదే కాని..ఆచరణలో
*బూర్గుల భవనానికి సెక్రటేరియట్- ట్రాపిక్ పాట్లు
*స్కూళ్లు తెరిచారు..విద్యార్దులు రావడం లేదు
*కాంగ్రెస్ కు రాహుల్, టిఆర్ఎస్ కు కెటిఆర్
*కోడెల సంగతి ఏమి చేస్తారూ చంద్రబాబూ
*నిజామాబాద్ పేరు నచ్చడం లేదట.
*పోలవరం అదారిటీకీ ఎపి ప్రభుత్వం జవాబు
*అజ్ఞాతంలోకి చిదంబరం
*జగన్ అమెరికా యాత్ర -లోకేష్ విమర్శ
*ఆర్టిసి విలీనంలో ఇబ్బందులు
*పెట్టుబడులతో రండి..సహకరిస్తాం- జగన్
*ఎపి ప్రభుత్వాన్ని ప్రశంసించిన కేంద్ర మంత్రి
*గొర్రెలు కాచుకునే వాడు మంత్రి కారాదా!
*ఎపి రాజదాని-కేంద్రం జోక్యం చేసుకోదు
*కోడెల కు అసెంబ్లీ దేవాలయమట... పూజారి అట
*కమలవనంలో పచ్చపుష్పాలు-జాగ్రత్త సుమా
*ఆదాని పెట్టుబడులు - మాపై నమ్మకమే కదా
*కెటిఆర్ ది రాజకీయ అజ్ఞానమా
*హుజూర్ నగర్ ఉప ఎన్నిక అందరికి పరీక్షే
*నిజామాబాద్ పేరు మార్చనవసరం లేదు
*మాజీ ముఖ్యమంత్రి కన్నుమూత
*చంద్రబాబు వంటివారి వల్ల గౌరవం పోతోంది
*చిదంబరంపై హైకోర్టు సీరియస్ వ్యాఖ్య
*జగన్ పై కన్నా కామెంట్
*లక్ష్మణ్ గల్లీ లీడర్ లా మాట్లాడుతున్నారు
*ఎంటర్ టైన్ మెంట్ మీడియాపై డిజిటల్ మీడియా దెబ్బ
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info