మీడియా ముఖ్యంగా టిడిపి మీడియా ప్రదానంగా పోలవరం రివర్స్ టెండరింగ్ పై పోలవరం అదారిటీ వ్యతిరేక వ్యాఖ్యలు చేసిందని వార్తలు ఇస్తే సాక్షిలో భిన్నమైన కదనం వచ్చింది.పోలవరం లో రివర్స్ టెండరింగ్ కు అదారిటీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని తెలిపింది.ఆ వివరాలు ఇలా ఉన్నాయి.
పోలవరం ప్రాజెక్టు హెడ్ వర్క్స్‌లో రివర్స్ టెండరింగ్ నిర్వహణకు పోలవరం ప్రాజెక్టు అథారిటీ (పీపీఏ) పచ్చజెండా ఊపింది. దీనివల్ల ప్రాజెక్టు పనుల్లో జాప్యం జరగకుండా, అంచనా వ్యయం పెరగకుండా చర్యలు తీసుకోవాలని నిర్దేశించింది. పీపీఏ అనుమతి ఇవ్వడంతో.. నిపుణుల కమిటీ సిఫార్సు మేరకు పోలవరం హెడ్ వర్క్స్, జల విద్యుదుత్పత్తి కేంద్రం పనులకు ఒకే ప్యాకేజీ కింద రివర్స్ టెండరింగ్ నోటిఫికేషన్ జారీ చేయడానికి జలవనరుల శాఖ ఉన్నతాధికారులు సన్నద్ధమవుతున్నారు. అని ఈ కదనం చెబుతోంది. tags : polavaram