తెలుగుదేశంలో ఇకపై యువతకు ప్రోత్సహిస్తామని ప్రతిపక్ష నేత ,టిడిపి అదినేత చంద్రబాబు నాయుడు చెప్పారు.పార్టీలోకి యువరక్తం రావల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు.
40%నుంచి 50% వరకు యువతను విధిగా ప్రో త్సహించాలి. వారు పెరిగితే పార్టీ భవిష్యత్ బాగుంటుంది. అనుబంధ సంస్థలని బలోపేతం చేయాలి. టీడీపీకి గెలుపోటములు, సంక్షోభా లు కొత్త కాదు. నా జీవితంలో ఓటమిని అంగీకరించను. తిరిగి విజయం సాధించేవరకూ పోరాడుతూనే ఉంటా. మనం గెలిచినప్పుడు విర్రవీగలేదు. అలాగే ఓటమికి కుంగిపోవాల్సిన అవసరం లేదు. టీడీపీ 37 ఏళ్లలో 5 ఎన్నికల్లో గెలిచింది. నాలుగు సార్లు ఓటమిపాలైందని ఆయన అన్నారు. tags : babu, defeat