తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అదికార టిఆర్ఎస్ కు తోక పార్టీగా మారిందని బిజెపి అద్యక్షుడు లక్ష్మణ్ అన్నారు.అన్ని రాష్ట్రాలలో తోక పార్టీ గా కాంగ్రెస్ మారిందని, తెలంగాణలో టిఆర్ఎస్ కు తోక పార్టీ అయిందని ఆయన అన్నారు. తెలంగాణ బిడ్డల బలిదానాలతో ఏర్పడిన టీఆర్ఎస్ ఒక కుటుంబానికే పరిమితం అయిందన్నారు. టీఆర్ఎస్తో కలిసి కాంగ్రెస్ లాలూచీ రాజకీయాలు చేస్తోందన్నారు. ప్రధాన ప్రతిపక్ష పాత్ర పోషించాల్సింది పోయి ప్రధాన అనుచర పార్టీగా మారిపోయిందన్నారు. కేటీఆర్, ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఇద్దరు కలిసి ఒకేలా మాట్లాడుతున్నారని, తోడు దొంగల్లా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. 2023లో బీజేపీ గెలుపును ఉత్తమ్, కుంతియా, కేసీఆర్, కేటీఆర్ అంతా ఏకమైనా అడ్డుకోలేరన్నారు. tags : tes, congress,bjp