వరద పెద్ద ఎత్తున వస్తున్నందున ఎపిలో ఉన్న అన్ని రిజర్వాయర్లు, చెరువులు నింపడానికి చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి జగన్ అదికారులను ఆదేశించారు.
రాయలసీమ, ప్రకాశం, నెల్లూరు జిల్లాల కలెక్టర్లకు ప్రత్యేకించి తెలిపారు. చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా కృష్ణాజలాలు వస్తున్నాయని.. అయితే ఇన్ని జలాలు ఉన్నా రిజర్వాయర్లను పూర్తిగా ఎందుకు నింపలేకపోతున్నామో స్టడీ చేయాలని ఆయన అన్నారు. ‘దేవుడి దయ, ప్రజల ఆశీర్వాదం వల్ల జలాలు వస్తున్నాయి. అన్ని ప్రాజెక్టుల గేట్లను ఎత్తివేశారు. మనకు కేవలం నెలరోజులు మాత్రమే అవకాశం ఉంటుంది. ఈ ఒక్క నెలలోనే అన్ని రిజర్వాయర్లు, చెరువులు నింపుకోగలగాలి. కృష్ణా పరీవాహక ముంపు ప్రాంతాల్లో తీసుకోవాల్సిన చర్యలన్నీ తీసుకోండి. కొన్ని చోట్ల కాల్వలకు గండ్లు పడుతున్నాయి. గోదావరిలో వరదలు తగ్గుతున్నాయి. ఆ ప్రాంతాల్లో వ్యాధులు రాకుండా జాగ్రత్తలు తీసుకోండి. రాయలసీమ, ప్రకాశం, నెల్లూరు జిల్లాల కలెక్టర్లు కంటెంజెన్సీ ప్లాన్ చేయండి అని కలెక్టర్లకు సూచించారు. tags : jagan