ఎపి శాసనసబ లో ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు చేతికి కట్టుతో తెలుగుదేశం పార్టీ విస్తృత స్థాయి సమావేశానికి రావడం అందరి దృష్టిని ఆకర్షించింది. ఆయన ఎందుకు అలా కట్టు తో వచ్చారా అని చర్చించుకున్నారు. అయితే చంద్రబాబు చేతికి స్వల్ప గాయమైందని,అందువల్ల చేతి నరంపై ఒత్తిడి పెరగడం వల్ల వైద్యులు కట్టు కట్టినట్లు మీడియాలో వార్తలు వచ్చాయి. కుడిచేతికి కట్టుకట్టుకొని ఆయన సమావేశానికి వచ్చారు.సహజంగానే వయసు ప్రబావం కూడా కొంత పడవచ్చు. tags : chandrababu, hand