వైఎస్ ఆర్ కాంగ్రెస్ ఎమ్మెల్యే కోటం రెడ్డి శ్రీదర్ రెడ్డి జర్నలిస్టుపై దాడి చేస్తే ,పోలీసులు ఎమ్మెల్యే ఇంటి వద్ద భద్రత పెట్టారని మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఆరోపించారు.
టీడీపీ నేతలను, జర్నలిస్టులను వైసీపీ నేతలు టార్గెట్ చేస్తున్నారని ఆయన ఆరోపించారు. ఎమ్మెల్యేనే దాడి చేసి చంపేస్తామని బెదిరిస్తే చర్యలు తీసుకోరా అని ప్రశ్నించారు. జర్నలిస్టుపై దాడి చేసిన ఎమ్మెల్యే ఆఫీసు దగ్గర బందోబస్తా అని మరోసారి ప్రశ్నించారు. పోలీసుల ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీస్తున్నారని సోమిరెడ్డి వ్యాఖ్యానించారు. tags : somireddy