నల్లధనాన్ని తెల్ల ధనంగా మార్చుకునేందుకు రాజదాని సంస్థ ప్రాంతం ఉపయోగపడిందని ప్రముఖ సామజిక ఉద్యమాకారుడు అనుమోలు గాందీ వ్యాఖ్యానించారు. విజయవాడలో జరిగిన ఒక సదస్సులో ఆయన మాట్లాడారు.రాజధాని ఎక్కడ వస్తుందో ముందే చెప్పి తన అనుచరులు భూములు కొనుక్కునేలా చంద్రబాబు ఇన్సైడర్ ట్రేడింగ్ చేయించారని ధ్వజమెత్తారు. నల్లధనాన్ని తెల్లధనంగా మార్చుకునేందుకు సీఆర్డీఏ పనికి వచ్చిందని, వేల కోట్ల రూపాయలు చేతులు మారిపోయాయని గాంధీ ఆరోపించారు. రాజధాని నిర్మాణాన్ని అవుట్సోర్సింగ్ సంస్థలకు అప్పగించడం ప్రపంచంలో ఎక్కడా జరగలేదని మరో వక్త పురేంద్రప్రసాద్ చెప్పారు. ప్రతి గ్రామాన్ని పోలీసు క్యాంపుగా మార్చి ప్రజలను భయపెట్టి భూముల్ని గుంజుకున్నారని మాజీ ఫ్రొఫెసర్ రామచంద్రయ్య మండిపడ్డారు. మాజీ ఐఎఎస్ అధికారి ఈఏఎస్ శర్మ మాట్లాడుతూ ప్రజలకు ఏది కావాలో దాన్నే పాలకులు చేపడితే సత్ఫలితాలు వస్తాయన్నారు. చంద్రబాబు తలపెట్టిన భూసమీకరణ పెద్ద బోగస్ అని, సీఆర్డీఏ ప్రాంతంలో గత ఐదేళ్లు మిలటరీ తరహా పాలన సాగిందని శేషగిరిరావు ఆరోపించారు. చివరకు నాటి ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డిని కూడా సీఆర్డీఏ పరిధిలోని గ్రామాల్లో పర్యటించకుండా అడ్డుకున్నారన్నారు. tags : amaravati