A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
ఎపి పెట్టుబడులు -అంతమంది రాయబారులు..
Share |
December 11 2019, 12:25 pm

పెట్టుబడుల సదస్సు అంటూ కోట్ల రూపాయల ప్రచార ఆర్భాటాలు లేవు.లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు వచ్చేస్తాయనో, లక్షల ఉద్యోగాలు రానున్నాయనో అబద్దాల హోరు లేదు.అయినా పెట్టుబడుల కోసం ఒక పెద్ద ప్రయత్నమే జరిగింది.డిప్లమాటిక్ అవుట్ రీచ్ పేరుతో జరిగిన ఈ పరిశ్రమల అవగాహన సదస్సులో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఎంత సింపుల్ గా మాట్లాడారు.ఎంత నిర్మొహమాటంగా, ఎంత నిజాయితీగా ఉన్నది ఉన్నట్లు ఆయన చెప్పారు. చాలా సరళంగా,సూఠిగా ,సుత్తి లేకుండా సింపుల్ గా ఉన్న జగన్ ప్రసంగం అందరిని ఆకట్టుకుంటుంది. పైగా ఆయనది వచ్చీ రాని ఇంగ్లీష్ కాదు. చక్కని భాషలో చెప్పదలచుకున్న విసయాలను నిక్కచ్చిగా చెప్పిన తీరు అబినందనీయం.ఈ మాట ఎ ందుకు చెబుతున్నానంటే తన ప్రభుత్వం తీసుకున్న రెండు ముఖ్యమైన నిర్ణయాలు వివాదస్పదమైనవని ఆయనే ఒప్పుకున్నారు.అలా చెప్పడానికి ఎంతో ధైర్యం ఉండాలి. విద్యుత్ ఒప్పందాల రద్దు వివాదాస్పదమే అయినా, పరిశ్రమలకు మేలు చేయడానికి, ప్రజలకు విద్యుత్ ను తక్కువ రేటుకు ఇవ్వడానికి ,అవినీతి లేని ,పారదర్శకమైన విదానం కోసం ఈ నిర్ణయం చేసినట్లు ఆయన వివరించారు.అంతేకాదు. తాను అదికారంలోకి వచ్చేసరికి ఇరవై వేల కోట్ల రూపాయల మేర డిస్కంలు బకాయిలు పడితే కట్టవలసింది ఎవరని ఆయన ప్రశ్నించారు. మరో నిర్ణయం డెబ్బై ఐదు శాతం ఉద్యోగాలు స్థానికులకే ఇవ్వాలన్న తమ ప్రభుత్వం చేసిన చట్టాన్ని కూడా ఆయన దాచలేదు. పైగా అది కూడా వివాదాస్పదమే అయినా, స్థానికుల మనసులు చూరగొనకపోతే పరిశ్రమలకు భూములు ఇవ్వడం కష్టం అవుతుందని, అలాగే ఇతర సమస్యలు వస్తాయని ఆయన అన్నారు.ఇందుకు ఒక పరిష్కారాన్ని కూడా ఆయన చూపారు.పరిశ్రమలకు ఎలాంటి స్కిల్ కావాలో చెబితే వాటికి సంబందించి ప్రభుత్వమే యువతకు శిక్షణ ఇప్పిస్తుందని, ప్రతి లోక్ సభ నియోజకవర్గంలో నైపుణ్య శిక్షణ కేంద్రం ఏర్పాటు చేస్తామని ఆయన చెప్పారు.ఈ రెండు పాయింట్లలో వచ్చిన డిప్లమాట్ లు కాని, పారిశ్రామికవేత్తలు కాని సంతృప్తి చెందారా?లేదా అన్నది వేరే విషయం.కాని ఒక ముఖ్యమంత్రి నిజాయితీగా తన అబిప్రాయాలు చెప్పారని, తద్వారా ఎపిలో పరిశ్రమలు పెట్టేవారికి ఇబ్బందులు ఉండవని బరోసా ఇచ్చారన్న అబిప్రాయం కలుగుతుంది.అంతేకాదు. తమ సంక్షేమ కార్యక్రమాలను కూడా ఆయన వారికి తెలియచేశారు. చెన్నై,హైదరాబాద్, బెంగుళూరు వంటి నగరాలు లేకపోవడం బలహీనతే అయినా, వెయ్యి కిలోమీటర్ల కోస్తా తీరం ఉండం,ఖనిజ సంపద ఉండడం తదితర బలాలు కూడా తమకు ఉన్నాయని జగన్ వివరించారు.గతంలో విశాఖలో పెట్టుబడుల సదస్సులో ఎన్ని రకాల విన్యాసాలు జరిగేవో మనం చూశాం. దారిపోయేవారితో కూడా వందల ,వేల కోట్ల ఒప్పందాలు అయిపోయినట్లు జరిగిన డ్రామాలు విన్నాం.ఇప్పుడు అవేమి లేవు. ఎవరైనా పెట్టుబడుదారులు, ఇతర దేశాల ప్రముఖులు వస్తే తనను చూసే వచ్చేవారని ఆనాటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తనకు తానే గొప్పలు చెప్పుకునేవారు. నిజమే .ఆయన సీనియారిటి కొంత ఉపయోగపడి ఉండవచ్చు.కాని అంతమాత్రాన ఇంకెవరికి ఏమీ లేదని చెప్పే ప్రయత్నంలో ఆయన పరువు పోగొట్టుకునేవారు.ఇప్పుడు మరి ఇంతమంది రాయబారులు ఎలా వచ్చారు? చంద్రబాబు లేకపోయినా వచ్చారే?అంటే దాని అర్దం ఏమిటి? ఎక్కడ పెట్టుబడి అవకావాలు ఉంటే అక్కడకు వచ్చేవారు ఎప్పుడూ ఉంటారని అర్దం.అంతేకాదు.ఏ ప్రభుత్వం పారదర్శకంగా ఉంటానని చెబుతుందో,వారివద్దకు ఎక్కువ మంది రావడానికి కూడా అవకాశం ఉంటుంది. ఇప్పుడు అదే జరిగింది. జగన్ ఎక్కడా ఇదంతా తన ఒక్కడి ప్రతిభే అని ప్రచారం చేసుకోలేదు.కేంద్రం సహకరించిందని చెప్పారు. ఇతర రాష్ట్రాలతో సత్సంబందాల గురించి ఆయన ప్రస్తావించారు.వేదిక మీద మోడీ పోటోకి కూడా అత్యంత ప్రాదాన్యత ఇచ్చారు. ప్రభుత్వాలు అలా ఉండాలి కాని, ఎక్కడ ఏది జరిగినా అంతా తనదే క్రెడిట్ అని, ఏది జరిగకపోయినా, అదంతా ఎదుటివాడిది డెబిట్ అని ప్రచారం చేయడం వల్ల రాష్ట్రానికి నష్టం జరిగింది. ఇప్పుడు జగన్ ఆ పని చేయడం లేదు.అందువల్లే ఎవరైనా సహకరించే పరిస్థితి ఏర్పడుతుంది. జగన్ ఇలాగే కొనసాగాలి. ఎవరు బాగా సహకరిస్తే వారికి కృతజ్ఞతలు తెలియచేయడం కనీస మర్యాద. దానిని జగన్ పాటించడం సంతోషం.అయితే పెట్టుబడులు రావడం అంత తేలిక కాదు. పెట్టుబడిదారులను ఆకర్షించి ,వారికి అనువైన హేతుబద్ద రాయితీలు కల్పించి పరిశ్రమలు వచ్చేలా చేస్తే జగన్ కు పేరు వస్తుంది.ఆ కృషిలో తొలి అడుగు ఇది.జగన్ విజయవంతం కావాలని ఆశీర్వదిద్దం.

tags : ap, investments

Latest News
*చంద్రబాబు అత్తగారికి కూడా మేమే పదవి ఇచ్చాం
*అమెరికాలో కాల్పులు- ఆరుగురు మృతి
*చంద్రబాబు ఆంద్రుల పరువు తీశారన్న చెవిరెడ్డి
*చంద్రబాబు,కరువు కవలపిల్లలు
*పోలవరం వద్ద మోడీ పేరే లేదే-బిజెపి
*చంద్రబాబు రుణమాఫీతో రైతులకు ఇక్కట్లు
*పోలవరం 35 శాతం పనులే అయ్యాయి
*అప్పుడు రోశయ్య ఏమి జవాబు చెప్పారంటే
*ఆయనది నీటి మీద మూట, ఈయనది శిలా శాసనం
*సి.ఎమ్.రమేష్ స్పీచ్ విన్నారా..మీకు ఏమనిపిస్తుంది
*స్పీకర్ vs చంద్రబాబు
*నాకు ఇంగ్లీష్ రాదంటారా.. బిల్ గేట్స్ వచ్చారు-చంద్రబాబు
*ఈనాడు ,ఆంద్రజ్యోతి మళ్లీ దొరికిపోయాయా
*చంద్రన్న స్కీములన్నిటిలో కేంద్రం నిదులున్నాయే
*పోలవరం వద్ద మోడీ పేరే లేదే-బిజెపి
*పోలవరం 35 శాతం పనులే అయ్యాయి
*ఎపి మాజీ డిజిపిపై విచారణకు కమిటీ
*ఎపిలో పది డయాలిసిస్ సెంటర్లు
*చంద్రబాబుకు, జగన్ కు అది తేడా
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info