మద్యప్రదేశ్ లో 200 చట్టాలను రద్దు చేయబోతున్నారు. ఆ రాష్ట్రంలో కాలం చెల్లిన చట్టాలను సమీక్షించి రద్దు చేయడానికి వీలుగా బాద్యతను మద్యప్రదేశ్ లా కమిషన్ కు అప్పగించారు. కమిషన్ చైర్మన్ గా గా ఉన్న జస్టిస్ వేద్ ప్రకాష్ ఆద్వర్యంలో మద్యప్రదేశ్ శాసనసభ ఇంతకాలం చేసిన చట్టాలను పరిశీలించారు.వంద చట్టాలను పూర్తిగా తొలగించచ్చని లా కమిషన్ నిర్ణయానికి వచ్చింది.ఈ సంఖ్య 200 కి పెరగవచ్చని చెబుతున్నారు.ఇలా రద్దు అయిన వాటిలో మద్య ప్రదేశ్ రుణ చట్టం, వ్యవసాయ చట్టం తదితర చట్టాలు ఉన్నాయి. గతంలో రైతుల నుంచి రుణాలు వసూలు చేయడానికి చట్టాలు ఉండేవి.ఇప్పుడు ఆ పరిస్థితి మారింది.ఆ చట్టం అవసరం లేదని కమిషన్ బావించింది. tags : mp., old acts