A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
కాంగ్రెస్ కాడి పారేస్తేనే బిజెపికి అవకాశం
Share |
January 22 2020, 7:47 am

తెలంగాణలో బిజెపి ఎదుగుదలకు అవకాశాలు ఎంత మేర ఉన్నాయి?బిజెపి నేతలు ప్రచారం చేస్తున్నంత సీన్ ఉందా అన్నదానిపై తర్జనభర్జనలు జరుగుతున్నాయి. ముఖ్యమంత్రి కెసిఆర్ ఈ విషయమై ఆందోళన అవసరం లేదని టిఆర్ఎస్ నేతలకు చెబుతున్నా,బిజెపికి చెక్ పెట్టే దిశగా ఆయన ఆలోచనలు సాగిస్తున్నారు.అయితే కాంగ్రెస్ పార్టీ కాడి పారేసి,బిజెపికి సహకరిస్తే తప్ప బిజెపి ఎదిగే అవకాశం లేదని కెసిఆర్ వ్యాఖ్యానించారని ఒక కదనం వచ్చింది.బిజెపి ముఖ్యంగా లోక్ సభ సీట్లు గెలిచిన నిజామాబాద్, కరీంనగర్, ఆదిలాబాద్ ప్రాంతాలలోని మున్సిపాల్టీలు, కార్పొరేషన్ లపై దృస్టి పెట్టవచ్చని బావిస్తున్నారు.మహబూబ్ నగర్ లోకూడా బిజెపి ప్రయత్నాలు చేయవచ్చని బావిస్తున్నారు.వాటితో పాటు సిరిసిల్, పెద్దపల్లి వంటి మున్సిపాల్టీలపై కూడా దృష్టి పెట్టవచ్చని చెబుతున్నారు. ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్, సికింద్రాబాద్ నియోజకవర్గాలలో లోక్ సభ కు బిజెపి ఎన్నికైన సంగతి తెలిసిందే.అయితే మున్సిపల్ ఎన్నికలలో కాంగ్రెస్ కాడి పారేసి,మైదానాన్ని బిజెపికి వదలివేస్తే తప్ప ఇబ్బంది ఉండదని టిఆర్ఎస్ భావిస్తోంది.

tags : congress

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info