తెలుగుదేశం హయాంలో ఆ పార్టీ ఎమ్మెల్యేలపై ఎవరైనా కేసు పెడితే అది తీసుకోవడమే కష్టంగా ఉండేది.పిర్యాదును స్వీకరించడం కోసం తంటాలు పడవలసి వచ్చేది. వైఎస్ ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వంలో ఆ ఇబ్బంది ఉన్నట్లు లేదు. నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీదర్రెడ్డిపై పోలీసులు కేసు నమోదు చేయడమే ఉదాహరణగా కనిపిస్తుంది. శ్రీధర్‌రెడ్డిపై దుర్గామిట్ట పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదైంది. గత రాత్రి ఎమ్మెల్యే సహా, అతడి అనుచరులు తనపై దాడి చేశారని జమీన్ పత్రిక ఎడిటర్ డోలేంద్రప్రసాద్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిపై పోలీసులు విచారణ చేస్తున్నారు. వైసిపి ఎమ్మెల్యేలు ఇలాంటి అబియోగాలు రాకుండా జాగ్రత్తపడవలసి ఉంటుంది. tags : sridhar reddy