జాతీయ పార్టీలలో ప్రాంతీయ స్థాయిలో నేతలు ఎదగడాన్ని ఇష్టపడరని ప్రముఖ జర్నలిస్టు శేఖర్ గుప్త అన్నారు. ముఖ్యమంత్రి జగన్ గతంలో చేసిన పాదయాత్రపై జయహో పుస్తకాన్ని ఆయన ఆవిష్కరించారు. వైఎస్ రాజశేఖరరెడ్డి ఎదిగిన తీరు, ఆ తర్వాత జగన్ ను ఎదుర్కున్న ఇబ్బందులను ప్రస్తావిస్తూ ఈ విషయం చెప్పారు. కాంగ్రెస్ పార్టీ రాష్ట్రాలలో నేతల ఎదుగుదలను ఒప్పుకునేది కాదని, దానివల్ల పార్టీకి బెడద కాంగ్రెస్ జాతీయ స్థాయి నేతలు భావిస్తారని ఆయన అన్నారు. వైఎస్ తో తన పరిచయాన్ని ప్రస్తావించి ,గతంలో ఒకసారి ఆయనను కలిసినప్పుడు వర్షాల అంశం గురించి చర్చ రాగా, వర్షాలు వస్తాయని ధీమా గా చెప్పిన తీరు, ఆయనకు దేవుడితో కాంటాక్ట్ ఉన్నట్లుటగా మాట్లాడారని ,ఆ తర్వాత వర్షాలు పడ్డాయని గుప్త అన్నారు.వైఎస్ రాజశేఖరరెడ్డి అనూహ్య మరణంతో కాంగ్రెస్ పూర్తిగా కష్టాలలో పడిందని ఆయన అన్నారు.బిజెపి కూడా ఇప్పుడు ముఖ్యమంత్రులను నామినేట్ చేస్తోందని ఆయన అన్నారు. tags : sekhar gupta