A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
కలిసి ఉంటే కలదు సుఖం-ఎపి,టి మంత్రులు
Share |
December 13 2019, 1:05 am

నాగార్జున సాగర్ లోకి కూడా పూర్తి స్థాయిలో నీరు వస్తుండడంతో ఆ ప్రాజెక్టు కింద ఉన్న కాల్వలకు నీటిని విడుదల చేశారు.ఈ సందర్బంగా జరిగిన కార్యక్రమంలో తెలంగాణ,ఎపి రాష్ట్రాల మంత్రులు జగదీష్ రెడ్డి, అనిల్ కుమార్ యాదవ్ లు పాల్గొన్నారు.రెండు రాష్ట్రాల రైతులకు.. రెండు పంటలకు సరిపోయేంతనీరు జలాశయాల్లోకి చేరుతోందని జగదీశ్‌రెడ్డి అన్నారు. కృష్ణమ్మకు సారెచీరలతోపాటు పూలమాలలు, పసుపు కుంకుమతో వాయినమిచ్చారు. సీఎం కేసీఆర్‌ కృష్ణా, గోదావరి నదుల్లోని ప్రతి చుక్క నీటిని ఒడిసిపట్టి తెలంగాణలోని బీడు భూములను సస్యశ్యామలం చేస్తున్నారని చెప్పారు. పక్కరాష్ట్రాలతో స్నేహపూర్వకంగా మెలిగి అభివృద్ధి చెందడం ఎలాగో సీఎం కేసీఆర్‌ ఆచరించి చూపారని పేర్కొన్నారు. కలిసిమెలిసి ఉంటూ.. సహజవనరులను సద్వినియోగం చేసుకుని ఇరురాష్ట్రాల రైతాంగాని కి లబి్ధచేకూరేలా నిర్ణయాలు తీసుకుంటున్నారన్నా రు. ఏపీ సీఎం జగన్‌మోహన్‌రెడ్డి, తెలంగాణ సీఎం కేసీఆర్‌లిద్దరు.. కలిసి ఉంటే కలదు సుఖం అని నిరూపించారని అనిల్‌కుమార్‌ యాదవ్‌ అన్నారు.

tags : sagar

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info