A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
చంద్రబాబుకు అంబటి సలహా
Share |
January 22 2020, 8:18 am

చంద్రబాబు అబద్దాలు ప్రచారాలు చేస్తే ప్రజలు నమ్మరని, ఇంతవరకు చేసిన అబద్దపు ప్రచారాల వల్లే టీడీపీకి 23 సీట్లు వచ్చాయని వైఎస్ ఆర్ కాంగ్రెస్ ఎమ్మెల్యే అంబటి రాంబాబు వ్యాఖ్యానించారు.ప్రతిపక్ష నేత చంద్రబాబు ఆశా వర్కర్లకు సంబందించి చేసిన ట్వీట్ లపై కౌంటర్ ఇచ్చారు. రాష్ట్రంలో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పాలనను మెచ్చుకోకున్నా ఫర్వాలేదు గానీ.. ప్రభుత్వంపై అనవసరంగా బురద చల్లవద్దని సలహా ఇచ్చారు. చంద్రబాబు పాలిచ్చే ఆవు కాదని, రక్తాన్ని పీల్చే జలగ అని విమర్శించారు. తమ దేశంలో చంద్రబాబులా మాట్లాడితే మెంటల్‌ ఆసుపత్రిలో వేస్తారని స్విట్జర్లాండ్‌ మంత్రి ఎప్పుడో చెప్పారని గుర్తు చేశారు.
బందరు పోర్టు తెలంగాణకు ఇచ్చేస్తున్నారంటూ చంద్రబాబు దుష్ప్రచారం చేస్తున్నారని విమర్శించారు.

tags : ambati rambabu

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info