A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
అవినీతి ఆరోపణ- దేవినేని తప్పులో కాలేశారా
Share |
August 14 2020, 11:03 am

వైఎస్ ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వంపై టిడిపి అవినీతి ఆరోపణ చేసింది కాని, అందులోనే పప్పులో కాలు వేసినట్లు కనిపిస్తుంది.మాజీ మంత్రి దేవినేని ఉమా ఈ ఆరోపణ చేశారు. సిమెంట్ కంపెనీలు అడిగిన మొత్తాన్ని ఇవ్వలేదన్న కోపంతో ఇసుక కొరత సృష్టించారని ఆయన అన్నారు. ఉచిత ఇసుక విధానాన్ని రద్దు చేసి, కొత్త విధానం అమల్లోకి వచ్చేలోగా వైసిపి చెందిన నేతలు, కార్యకర్తలను కుబేరులను చేయాలనే ఆలోచనతో ప్రభుత్వం వ్యవహరిస్తోందనిఆయన అన్నారు. సిమెంట్‌ కంపెనీలు బస్తాకు రూ.5 ఇవ్వాలని వైకాపాలో చతుష్టయంగా పేరొందిన సజ్జల, గంగిరెడ్డి, సుబ్బారెడ్డి, విజయసాయిరెడ్డి డిమాండ్‌ చేయడం నిజం కాదా? అని ప్రశ్నించారని టిడిపి మద్దతు మీడియాలో ప్రముఖంగా వచ్చింది. వారి డిమాండ్‌కు కంపెనీల నుంచి సానుకూల స్పందన రాకపోవడం వల్లే ప్రజలకు ఇసుక లభ్యతను కష్టతరం చేశారని ఆరోపించారు.ఒకపక్క ఇసుక కొరత ఉందని ,మరో పక్క కుబేరులను చేస్తున్నారని అంటారు.ఈ రెండిటిలో ఏదో ఒకటే నిజం అవ్వాలి కదా..నిజంగానే సిమెంట్ కంపెనీలను ఐదు రూపాయల చొప్పున అడిగి ఉంటే ఎగిరి గంతేసి ఇచ్చేవి కాదా? ఆ విషయం ఉమా కు తెలియదని అంటే నమ్మాలా?సిమెంటు కంపెనీలు డబ్బు ఇవ్వలేదంటే అవినీతి జరగలేదనే కదా?ఎక్కడైనా సిమెంట్ కంపెనీల కోసం ఇసుక కొరతను సృష్టిస్తారా?చిత్రమైన వాదనగానే కనిపిస్తుంది.ఇసుక కొరత ఉందని, దానిని తీర్చాలని అడగడం తప్పు కాదు.కాని ఇలాంటి పిచ్చి ఆరోపణలు చేస్తేనే పరువు పోతుంది.టిడిపి హయాంలో ఇసుక మాఫియాలు విజృంభించిన సంగతి తెలిసిందే కదా..నెల రోజులలోనే ఇసుక అమ్మితే కుటేరులు అయిపోతారా?ఉమా ఇలా పప్పులోనో,తప్పులోనో కాలు వేయలేదా?

tags : devineni ima, allegation

Latest News
*సినిమాహాళ్లకు ప్రజలు వస్తారా?అల్లు అరవింద్ డౌట్
*చంద్రబాబు తీరును తప్పుపట్టిన డిజిపి
*తెలంగాణ కరోనా బులెటిన్
*అద్దంకి దయాకర్ కు అన్యాయం చేస్తున్నారా
*హైదరాబాద్ లో కొత్తగా 25 బస్తీ దవాఖానాలు
*కాంగ్రెస్ కు మరో మాజీ ఎమ్.పి గుడ్ బై చెబుతారా
*టి.లో కరోనా మరణాలు సగమే రికార్డవుతున్నాయా
* ప్రైవేటు ఆస్పత్రులు దారిలోకి వస్తాయా?
*2023లో దొరల పాలన అంతం- మందకృష్ణ
*27 వేల సైబ‌ర్ ఫిర్యాదులు
*ఎపిలో త్వరలో దిశ పెట్రోల్స్‌ ప్రారంభం
*తెలంగాణలో భారీ ఎత్తున ప్రజా టాయిలెట్లు
*రాయలసీమ లిఫ్ట్ వల్ల నిజంగా టి.కి నష్టమా
*ఎపిలో కొత్త ప్రయోగం
*కెటిఆర్ క్యాబినెట్ నిర్వహించడం ఏమిటి
*ప్రియాంక గాందీ గ్రూప్ లో రేవంత్ చేరారా
*జాతీయ విద్యా విదానంపై గవర్నర్ సెమినార్
*ఆ మంత్రివర్గంలో ఐదుగురు ఒకే కుటుంబం
*50 శాతం యువతలో పెరుగుతున్న నైరాశ్యం
*వైఎస్ ఆర్ చేయూత స్కీమ్ పై సర్వత్రా హర్షం
*టిడిపి బురద చల్లితే మహిళలే బుద్ది చెబుతారు
*దిశ చ‌ట్టం కింద ఇప్ప‌టివ‌ర‌కు ముగ్గురికి మ‌ర‌ణ‌శిక్ష
*దిశచట్టం పై జగన్ సమీక్ష
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info