A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
ఎపికి 200 ఎలక్ట్రికల్ బస్ ల కేటాయింపు
Share |
January 22 2020, 6:53 am

ఆందప్రదేశ్ కు కేంద్రం 30౦ విద్యుత్ ఆదారంగా నడిచే బస్ లను కేటాయించింది.ఎలక్ట్రికల్ వెహికిల్స్ ను ప్రోత్సహించే పదకం కింద కేంద్రం రాయితీపై రాష్ట్రాలకు సరఫరా చేస్తోంది.
దేశంలో 64 నగరాలకు 5,595 విద్యుత్‌ బస్సులను కేటాయించగా.. ఏపీలోని విశాఖకు వంద బస్సులు, విజయవాడ, అమరావతి, తిరుపతి, కాకినాడలకు 50 చొప్పున మంజూరు చేశారు. ఒక్కో బస్సు ఖరీదు రూ. కోటి వరకు ఉండగా, కేంద్రం 40 శాతం రాయితీ ఇవ్వనుంది. వెయ్యి బస్సుల కొనుగోలుకు ఆర్టీసీ డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ హెవీ ఇండస్ట్రీస్‌ (డీహెచ్‌ఐ)కు జూన్‌ నెలలోనే ఆర్టీసీ ప్రతిపాదనలు సమర్పించింది. విద్యుత్‌ బస్సులకు రాష్ట్ర ప్రభుత్వం తరఫున న్యూ అండ్‌ రెనెవబుల్‌ ఎనర్జీ డెవలప్‌మెంట్‌ ఆఫ్‌ ఆంధ్రప్రదేశ్, ఏపీ ట్రాన్స్‌కో, ఎస్పీడీసీఎల్, ఇంటర్నేషనల్‌ ఆర్గనైజేషన్‌ ఫర్‌ పబ్లిక్‌ ట్రాన్స్‌పోర్టు సహకారం అందిస్తాయి. ఇప్పటికే 300 బస్సులను కేటాయించడంతో మిగిలిన 700 బస్సుల మంజూరు కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నాలు సాగిస్తోంది.

tags : ap, buses,

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info