A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
బిజెపిలోకి టిడిపి సీనియర్ నేత
Share |
January 24 2020, 10:36 am

సీనియర్ నేత, ఆరుసార్లు ఎమ్మెల్యేగా గెలుపొందిన ప్రముఖుడు మోత్కుపల్లి నరసింహులు బారతీయ జనతా పార్టీలో చేరబోతున్నారని సమాచారం. ఆయన ఇప్పటికే పార్టీ ప్రదాన కార్యదర్శి పి.మురళీధర్ రావు తో చర్చలు జరిపారు. ఎపి బిజెపి నేత సుధీష్ రాంభొట్ల నివాసంలో వారు చర్చలు చేశారు. అన్ని లాంఛనాలు పూర్తి అయ్యాయని, ఇక బిజెపిలో మోత్కుపల్లి చేరడమే తరువాయి అని అంటున్నారు. ఒక తేదీని నిర్ణయించుకుని ఆయన పార్టీలో చేరవచ్చు. గత ఏడాది టిడిపికి ఆయన రాజీనామా చేశారు.1983 లో తొలిసారి ఎమ్మెల్యే అయిన ఆయన ఒక సారి ఇండిపెండెంట్ గా మరో సారి కాంగ్రెస్ పక్షాన ,మిగిలిన నాలుగుసార్లు టిడిపి పక్షాన గెలిచారు. ఎన్.టి.ఆర్.క్యాబినెట్ లో మంత్రిగా ఉన్నారు.పార్టీ చీలిక సమయంలో ఎన్.టి.ఆర్.పక్షాన నిలబడ్డారు. ఆ తర్వాత కొంతకాలం కాంగ్రెస్ లో ఉండి తిరిగి టిడిపిలోకి వచ్చారు. కాని గత ఏడాది చంద్రబాబుపై తీవ్ర విమర్వలు చేసి పార్టీకి దూరం అయ్యారు.

tags : motkupalli

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info