A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
మోడీ,అమిత్ షా ల మాస్టర్ స్ట్రోక్
Share |
January 22 2020, 6:53 am

జమ్ము-కశ్మీర్ సమస్యను పరిష్కరించే క్రమంలో ప్రదాని మోడీ, హోం మంత్రి అమిత్ షా ద్వయం మాస్టర్ స్ట్రోక్ కొట్టారని చెప్పాలి.దశాబ్దాల తరబడి నలుగుతున్న ఈ సమస్యను ఒక ముగింపు ఇచ్చే లక్ష్యంతో ఒక పెద్ద రిస్కే తీసుకున్నారు.అయితే ఇది వారికి,బిజెపి కి పాజిటివ్ స్పందనే వచ్చే అవకాశం స్పష్టంగా కనబడుతోంది. కశ్మీర్ లో ఉండే భావోద్రేకాలు వేరు. మిగిలిన దేశం అంతటా ఉన్న భావోద్వేగం వేరుగా ఉందని చెప్పాలి. చాలా మందికి ఒక అబిప్రాయం ఉంది.ఏమిటి ఈ కశ్మీర్ సమస్య.ఇంకెన్నేళ్లు.వేల కోట్లు ఖర్చు చేసినా అక్కడ ఉగ్రవాదం ఎందుకు పెరుగుతోంది?కొంతమంది వేర్పాటు వేదులు ఎందుకు అవుతున్నారు?భారత్ లో అంతర్భాగం అవడానికి ఎందుకు సిద్దపడడం లేదు? పాక్ అనుకూల భావజాలం ఎందుకు అక్కడ వ్యాప్తి చెందుతోంది.దీనిని ఏదో ఒకటి తేల్చేయాలని అనుకునేవారు కోట్ల లో ఉన్నారు. వారంతా ఇప్పుడు మోడీకి అఖండమైన మద్దతు ఇస్తున్నారు.అయితే కశ్మీర్ లోని కొన్ని ప్రాంతాల వారు తమకు వ్యతిరేకమైన నిర్ణయంగా సెంటిమెంటుతో ఉండవచ్చు.దీనిని రెండుకోణాలలో చూడాలి. రాజ్యాంగపరమైన కోణం ఒకటి, రాజకీయ కోణం ఒకటి. ఈ రెండిటిలో ముందుగా రాజ్యాంగం ప్రకారం చూస్తే కశ్మీర్ కు ఉన్న ప్రతిపత్తిని రద్దు చేయడానికి కేంద్రం సాహాసోపేతంగా నిర్ణయం చేసింది. పార్లమెంటులో ఆమోదం తెలపడానికి ముందుగానే రాష్ట్రపతి తో ఆమోద ముద్ర వేయించుకున్నారు.కశ్మీర్ ఇంతకాలం ఇతర రాష్ట్రాలకన్నా ఒక మెట్టు ఎక్కువలో ఉన్నారన్న అబిప్రాయం ఉంది. కేంద్రం తీసుకున్న నిర్ణయంతో ఒక మెట్టు దిగువకు వచ్చినట్లయింది. అంతేకాదు..రాస్ట్రాన్ని విభజించడం ద్వారా సరికొత్త పరిష్కార మార్గాన్ని కేంద్రం అన్వేషించిందని అనుకోవాలి.దీనివల్ల అక్కడ కేంద్రం అదికారం పెరుగుతుంది. లెప్టినెంట్ గవర్నర్ కేంద్రం కనుసన్నలలోనే పని చేస్తారు.డిల్లీ తరహాలోనే అసెంబ్లీ ఉంటుంది. అంటే పూర్తి స్తాయి శాసనసభ ఉండదన్నమాట.శాంతిబద్రతల అంశం కేంద్రం పరిదిలోకి వస్తుంది.దీంతో మొత్తం పరిస్థితి అంతా కేంద్ర ప్రబుత్వ నియంత్రణలోకి వస్తుంది.దీనివల్ల ఉగ్రవాదం, వేర్పాటు వాదం వంటివి తగ్గితే మంచిదే. అయితే తమ స్తాయిని తగ్గించారని ఇది కశ్మీరీలకు అవమానం అన్న భావం ప్రబలితే సమస్య అంత తేలికగా పరిష్కార కాదు.ఇక్కడ కేంద్రం రిస్కు తీసుకున్నదని అనుకోవాలి. మరో వైపు దేశ జనజీవన స్రవంతిలోకి కశ్మీరీలను తీసుకురావడం మంచి పరిణామమే. ముఖ్యంగా కశ్మీర్ మహిళలు ఇతర కశ్మీరేతర భారతీయులను వివాహం చేసుకుంటే కశ్మీర్ పౌరసత్వం పోతుందన్న నియమం దారుణంగా ఉంది.అదే పాకిస్తాన్ వ్యక్తిని పెళ్లి చేసుకోవచ్చట.ఇది అసంబద్దంగా ఉంది. అలాగే కశ్మీర్ లో బయటవారు ఎలాంటి ఆస్తులు కలిగి ఉండకపోవడం,వ్యాపార అవకాశాలు లేకపోవడం వల్ల కశ్మీరీలకే నష్టం జరుగుతుంది.ఇప్పుడు ఇతర ప్రాంతాలవారి పెట్టుబడులు ఆకర్షించడం ద్వారా అక్కడ ఉపాది అవకాశాలు మెరుగుపడవచ్చు.అలాగే కశ్మీరీలు కూడా తామ పూర్తిగా భారతీయులం అన్నభావనతో ఇతర ప్రాంతాలతో మిళితం అవడం వారికి మేలు చేస్తుంది.అయితే అక్కడ రాజకీయ పార్టీలు ప్రజలను రెచ్చగొట్టే అవకాశం ఉంది.భావోద్వేగాలను పెంచి మరికొంతకాలం ఉద్రిక్తలు కొనసాగించవచ్చు.ఇక్కడే కేంద్రం అక్కడ ఉపాది అవకాశాలు పెంచి వారి మనసులను గెలుచుకోవాలి.ఇది వాళ్ల మంచికే అన్న అబిప్రాయం కలిగించగలగాలి.ఇక రాజకీయంగా చూస్తే బిజెపికి ఒక్కసారిగా దేశ వ్యాప్తంగా ఆదరణ పెరుగుతుంది.మతపరమైన పోలరైజేషన్ కూడా బాగా ఉపయోగపడుతుంది.కాంగ్రెస్ పార్టీ బిన్నమైన స్టాండ్ తీసుకున్నందున అది బిజెపికి మరింతగా కలిసి రావచ్చు.కశ్మీరీలకు అవమానంగా కేంద్రం వ్యవహరించిందని, ఇది ప్రమాదకరమని, ప్రజాస్వామ్య యుతంగా లేదని, ప్రధానమంత్రి స్థాయ నుంచి,పూర్తి స్థాయి ముఖ్యమంత్రి కూడా లేని రాష్ట్రంగా మార్చారని గులాం నబీ అజాద్ విమర్శించారు. అయితే వామపక్ష నేతలు రంగరాజన్ వంటి వారు ఇది రాష్ట్రాల మీద దాడిగా అభివవర్ణించారు.ఏ రాస్ట్రాన్ని అయినా ఇలాగే చీల్చవచ్చని అబిప్రాయపడ్డారు.తృణమూల్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్రాల హక్కులను హరించే విధంగా ప్రభుత్వం వ్యవహరించిందని విమర్శించింది.అయితే బహుజనసమాజ్ వాది పార్టీ , ఆమ్ ఆద్మి పార్టీ లు కూడా బిజెపికి మద్దతు ఇవ్వడం కొత్త పరిణామం. వైఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ పూర్తి స్తాయిలో మద్దతు ఇవ్వగా, తెలుగుదేశం మాత్రం తప్పనిసరి అయి మద్దతు ఇచ్చినట్లు స్పందించినట్లు అనిపిస్తుంది.మొత్తం మీద రాజ్యాంగపరంగా కాని, రాజకీయపరంగా కాని బిజెపి సంచలన నిర్ణయం తీసుకుంది.అది సాహసంతో కూడిందే. ఆ సాహసం మోడీ, షా ల ద్వయానికి మైలేజీ తెచ్చేదనడంలో సందేహం లేదు.భారత దేశ చరిత్రలో వీరిద్దరూ జంట నేతలుగా చిరస్థాయిగా నిలిచిపోతారు.

tags : kashmir

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info