A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
పోలవరం- అవినీతిపై మోడీ,షెకావత్ ల తేడా
Share |
August 14 2020, 11:05 am

పోలవరం ప్రాజెక్టు కాంట్రాక్టు రద్దు విషయంలో కేంద్ర మంత్రి గజేంద్ర షెకావత్ వ్యాఖ్యలు కొంత ఆశ్చర్యంగానే ఉన్నాయి.ఎపి ప్రభుత్వం నవయుగ కంపెనీకి నామినేషన్ పద్దతిలో ఇచ్చిన టెండర్ ను రద్దు చేసింది.ఇందుకు సంబందించి ఒక నిపుణుల కమిటీని నియమించి ,ఆ కమిటీ నివేదిక ఇచ్చిన తర్వాత దాని ఆదారంగా చర్యలు తీసుకుంది.ఇందులో సుమారు 2300 కోట్ల అవినీతి ,నిబందనల ఉల్లంఘన వంటివి జరిగాయని కమిటీ అంచనా వేసింది.విద్యుత్ ప్రాజెక్టు అసలు ప్రారంబం కాకముందే 724 కోట్ల మొబిలైజేషన్ అడ్వాన్స్ ఇచ్చిన తీరును తప్పు పట్టింది.ఈ నేపద్యంలో ముఖ్యమంత్రి జగన్ ఈ కాంట్రాక్ట్ ను రద్దు చేసి ,రివర్స్ టెండరింగ్ పద్దతిలో మళ్లీ టెండర్లు పిలిచి నవంబర్ ఒకటి నాటికి పనులు ఆరంబించాలని నిర్ణయించారు. ఇప్పుడు ఎలాగూ వరదల కారణంగా పనులు సాగవు.పార్లమెంటులో షెకావత్ ఈ మద్యకాలంలో రెండు చిత్రమైన ప్రకటనలు చేశారు. పోలవరం ప్రాజెక్టుకు సంబందించి అవినీతి గురించి జవాబు చెప్పకపోగా, విచారణ లేమీ జరగడం లేదని అన్నారు.తాజాగా కాంట్రాక్టు రద్దు బాదాకరం అన్నారు. దీనివల్ల ప్రాజెక్టు జాప్యం అవుతుందా?అన్న అనుమానం వ్యక్తం చేశారట.ఆయన నిజంగానే అదే ఉద్దేశంతో ఉంటే ఆ విషయాన్ని ప్రదాని మోడీతో చెప్పి ఉండాల్సింది.ఎందుకంటే గత ఎన్నికల ముందు ప్రదాని మోడీ వచ్చి ఆంద్రప్రదేశ్ లో పోలవరం, రాజధాని ప్రాజెక్టులు టిడిపి నాయకత్వానికి ఎటిఎమ్ ల మాదిరి ఉపయోగపడుతున్నాయని చెప్పి వెళ్లారు.అంటే ఆనాటి టిడిపి ప్రభుత్వం దొరికిన కాడికి ఆ ప్రాజెక్టులలో డబ్బు తినేసిందని కదా మోడీ చెప్పింది.దానిపై విచారణ చేయిస్తామని,కేంద్రానికి కొత్త ప్రభుత్వం లేఖలు రాయాలని,పోలవరంలో అవినీతి బయటకు తీయాలని ఎపి బిజెపి నేతలు పలువురు పెద్ద ఎత్తున ఆరోపణలు చేసేవారు.ఇప్పుడు సుమారు 2300 కోట్ల మేర అక్రమాలు జరిగాయని నిపుణుల కమిటీ నిర్దారించినట్లు వార్తలు వచ్చాయి.మరి అలాంటప్పుడు దానిపై చర్యలు తీసుకోవాలా?వద్దా?అన్నది కేంద్ర మంత్రి చెప్పాలి కదా?లేకపోతే ప్రధాని మోడీ ఉబుసుపోక పోలవరంలో పెద్ద ఎత్తున అవినీతి జరిగిందని ఆరోపించి వెళ్లారా?కేంద్ర మంత్రే విషయంపై అవగాహన లేకుండా మాట్లాడితే ఏమి చేయాలి?గతంలో ఉమాబారతి, నితన్ గడ్కరిలు మంత్రులుగా ఉండేవారు.గడ్కరి హయాంలో కాంట్రాక్టు రద్దు తదితర అంశాలలో ఎంత వివాదం అయిందో షెకావత్ కు తెలిసి ఉండకపోవచ్చు.ఆనాటి కాంట్రాక్టర్ రాయపాటి సాంబశవరావు 2014 ఎన్నికల సమయంలో ఎంత మొత్తం లో టిడిపికి డబ్బు ఇచ్చింది?కాంట్రాక్టు పరిణామాల గురించి గడ్కరికి చెవలో ఏమి చెప్పింది షెకావత్ కు తెలిసి ఉండకపోవచ్చు.అసలు ప్రాజెక్టులో అవినీతి జరిగినా వదలివేయాలని ఆయన చెబుతున్నారా?అలాగే నామినెటెడ్ పద్దతిలో తమకు కావల్సిన కాంట్రాక్టర్లకు వందలు,వేల కోట్ల పనులు ఏ ప్రభుత్వం అయినా అప్పగించవచ్చని కేంద్ర మంత్రి చెప్పదలిచారా?ఇదేనా. బిజెపి అవినీతిపై పోరాడే తీరు?టిడిపి నేతలకు ఒక ఆర్ట్ ఉందని అంటారు. చంద్రబాబు తెలివిగా తన మనుషులను ఆయా వ్యవస్తలలో పెట్టి రాజకీయం నడుపుతారని ప్రసిద్ది,గతంలో కాంగ్రెస్ లో ఆయనకు అనుకూల వర్గం, వ్యతిరేక వర్గం ఏర్పాటు చేసుకున్నారు.ఆ తర్వాత బిజెపిలో కూడా తన మద్దతుదారులుఉండేలా జాగ్రత్తపడ్డారని అంటారు.కాకపోతే అనుకోకుండా బిజెపికి దూరం అయ్యారు.దాంతో బిజెపిలోని ఆయన మద్దతుదారులు నిస్సహాయంగా మిగిలిపోయారు. దారుణమైన ఓటమి తర్వాత బిజెపిలోకి చంద్రబాబు సన్నిహితులే వెళ్లారు. పైగా వారు చంద్రబాబుపై ఉన్న స్వామి భక్తిని వదలుకోవడం లేదు.అంటే బిజెపిలో వారు కోవర్టులుగా పనిచేస్తున్నారన్నమాట.బిజెపి ఎపి ఇన్ చార్జీ సునీల్ దియోదర్ తన ప్రసంగాలలో చంద్రబాబు జైలుకు వెళ్లడం ఖాయమని చెబుతుంటే,బిజెపిలో చేరిన టిడిపి మాజీ నేత సుజనా చ దౌదరి మాత్రం చంద్రబాబుపై అసలు కేసులే రావని చెబుతున్నారు.దీనిని బట్టి చంద్రబాబు కోటరి బిజెపిలో యాక్టివ్ అయిపోయిందని అనుకోవాలి.ఏది ఏమైనా కేంద్ర మంత్రి షెకావత్ అవినీతి విషయంలో,పోలవరం ప్రాజెక్టులో ఏమి జరిగిందన్నదానిపై పూర్తి అవగాహన చేసుకుని మాట్లాడాలి తప్పు టిడిపి వారి ప్రతినిదిగా మాట్లాడితే అర్దం లేదు.నెల రోజులలోపు కొత్త కాంట్రాక్టర్ నియామకం జరిగితే నష్టం ఏమి ఉండదు. అయితే అదే సమయంలో జగన్ ప్రభుత్వం కూడా నిర్దిష్ట చర్యలు తీసుకోవాలి.ఈ వ్యవహారం లిటిగేషన్ గా మారకూడదు.పోలవరం పనులు చకచకా జరిగి వారు ప్రకటించినట్లు 2021 నాటికి అయ్యేలా చూసుకోవాలి.అప్పుడు జగన్ కు గొప్ప పేరు వస్తుంది.అయితే కేంద్రమంత్రికి ముందుగానే ఎపి ప్రభుత్వం నుంచి సంబందిత మంత్రి లేదా ఉన్నతాదికారులు ఎవరైనా ఈ పరిస్తితిని వివరించి ఉండాల్సింది. అంటే కేంద్రంతో సమాచారం లోపం లేకుండా జాగ్రత్తపడాలన్నమా.ఇక మాజీ మంత్రి దేవినేని ఉమా వంటి వారు పిచ్చి వ్యాఖ్యలు చేస్తున్నారు. తమ వర్గం వారికి కాంట్రాక్టు ఇవ్వడానికి వైసిపి ప్రభుత్వం ప్రయత్నిస్తోందని ఆయన ఆరోపించారు.అంటే దాని అర్దం టిడిపి వారు తమకు చుట్టమనో, తమ వర్గం అనో, లేదా తమకు మద్దతు ఇచ్చే మీడియా పెద్దలకు సన్నిహితుడనో నవయుగకు నామినేషన్ పద్దతిలో కాంట్రాక్టు ఇచ్చారా అన్న ప్రశ్నకు కూడా జవాబు ఇవ్వాలి.అలా నామినేషన్ పద్దతిలో ఇవ్వడం నిబంధనలు అనుమతిస్తాయా అన్నదానికి జవాబు ఇవ్వాలి.అసలు కేంద్రం చేపట్టవలసిన ఈ ప్రాజెక్టును ఎందుకు తీసుకుంది?మొదట రెండేళ్లు ఎందుకు పట్టించుకోనిది కూడా వివరించాలి. టిడిపి నేతల ఆరోపణలు,వైఎస్ ఆర్ కాంగ్రెస్ వారి సమాదానాలు ఎలా ఉన్నా, జగన్ ప్రభుత్వంపై పెద్ద బాద్యత ఉంది.కేంద్రం సహకారంతో ఈ ప్రాజెక్టును సకాలంలో పూర్తిచేయాలి.లేకుంటే జగన్ పై విమర్శలు వచ్చే అవకాశం ఉంటుంది.
(గ్రేట్ ఆంద్రలో ప్రచురితం)

tags : polavaram

Latest News
*సినిమాహాళ్లకు ప్రజలు వస్తారా?అల్లు అరవింద్ డౌట్
*చంద్రబాబు తీరును తప్పుపట్టిన డిజిపి
*తెలంగాణ కరోనా బులెటిన్
*అద్దంకి దయాకర్ కు అన్యాయం చేస్తున్నారా
*హైదరాబాద్ లో కొత్తగా 25 బస్తీ దవాఖానాలు
*కాంగ్రెస్ కు మరో మాజీ ఎమ్.పి గుడ్ బై చెబుతారా
*టి.లో కరోనా మరణాలు సగమే రికార్డవుతున్నాయా
* ప్రైవేటు ఆస్పత్రులు దారిలోకి వస్తాయా?
*2023లో దొరల పాలన అంతం- మందకృష్ణ
*27 వేల సైబ‌ర్ ఫిర్యాదులు
*ఎపిలో త్వరలో దిశ పెట్రోల్స్‌ ప్రారంభం
*తెలంగాణలో భారీ ఎత్తున ప్రజా టాయిలెట్లు
*రాయలసీమ లిఫ్ట్ వల్ల నిజంగా టి.కి నష్టమా
*ఎపిలో కొత్త ప్రయోగం
*కెటిఆర్ క్యాబినెట్ నిర్వహించడం ఏమిటి
*ప్రియాంక గాందీ గ్రూప్ లో రేవంత్ చేరారా
*జాతీయ విద్యా విదానంపై గవర్నర్ సెమినార్
*ఆ మంత్రివర్గంలో ఐదుగురు ఒకే కుటుంబం
*50 శాతం యువతలో పెరుగుతున్న నైరాశ్యం
*వైఎస్ ఆర్ చేయూత స్కీమ్ పై సర్వత్రా హర్షం
*టిడిపి బురద చల్లితే మహిళలే బుద్ది చెబుతారు
*దిశ చ‌ట్టం కింద ఇప్ప‌టివ‌ర‌కు ముగ్గురికి మ‌ర‌ణ‌శిక్ష
*దిశచట్టం పై జగన్ సమీక్ష
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info