A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
రాత్రిపూట టీవీ చూడనన్న గవర్నర్
Share |
August 5 2020, 12:48 pm

మీడియాలో నెగిటివ్ వార్తలే ఎక్కువగా చూపించడంపై గవర్నర్ నరసింహన్ ఆవేదన వ్యక్తం చేశారు.రాత్రిపూట తాను టీవీ చూడనని,తన భార్య సీరియల్స్ చూస్తారని ఆయన అన్నారు. సాక్షి మీడియా ఎక్స్ లెన్స్ అవార్డుల ప్రదానోత్సవ సభలో ఆయన ప్రసంగించారు.‘సమాజంలో ప్రతికూల ధోరణి క్రమంగా పెరుగుతోంది. పత్రికల మొదటి పేజీ, ఎలక్ట్రానిక్‌ మీడియాలో విచారకరమైన వార్తలకు ప్రాధాన్యత ఇవ్వడంతో.. సమాజంలో చెడు తప్ప మరేదీలేదనే అభిప్రాయం ప్రజల్లో ఏర్పడే ప్రమాదముంది. ప్రజాస్వామ్యంలో నాలుగో స్తంభంగా (ఫోర్త్‌ ఎస్టేట్‌) చెప్పుకునే మీడియాకు సంబంధించి.. నేను ఐదో లేదా ఆరో స్తంభంగా నా మనస్సాక్షి మేరకు మాట్లాడాలని అనుకుంటున్నా. నా మాటలు ఫోర్త్‌ ఎస్టేట్‌తో విభేదించేలా ఉన్నా.. సమాజంలో సానుకూల ధోరణి పెరిగేందుకు ఉపయోగపడుతుందని అనుకుంటున్నా.

ఉదయాన్నే ఎస్‌వీబీసీ లాంటి భక్తి ఛానెల్‌ను చూస్తే ఓ రకమైన సంతృప్తి లభిస్తుంది. కానీ ఆ తర్వాత పేపర్‌ తెరిచి చూసినా.. టీవీ ఆన్‌ చేసినా అన్నీ చెడు వార్తలే కనిపిస్తాయి. ఇలాంటి వార్తలను మొదటి పేజీలు, టీవీ హెడ్‌లైన్లలో రాకుండా నివారించలేమా’అని గవర్నర్‌ నరసింహన్‌ ప్రశ్నించారు. తాను ఏ ఒక్క మీడియా సంస్థనుద్దేశించి ఈ వ్యాఖ్యలు చేయడం లేదని, 130 కోట్ల మంది ప్రజలున్న దేశంలో ఇలాంటి సంస్కృతి ప్రబలకుండా ఉండాలన్నదే తన ఉద్దేశమన్నారు.
ప్రమాదాలు, వరదలు సంభవించినపుడు మీడియా అనుసరించే ధోరణిపై కూడా గవర్నర్‌ అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇలాంటి సందర్భాల్లో మీడియా కూడా తన వంతు సామాజిక బాధ్యతగా సహాయ సామగ్రి వంటివి చేరవేయడం ద్వారా ప్రజల్లో సానుకూల ధృక్పథం పెరిగేలా చూడాలన్నారు.గవర్నర్ మారిపోతారంటూ వార్తలు రాస్తున్నారని, గవర్నర్ ఎప్పుడో ఒకప్పుడు మారతారని ఆయన చమత్కరించారు.

tags : narasimhan

Latest News
*రఘురాజు రామభక్తి-అందులోను బురదచల్లుడు
*తెలంగాణ కరోనా బులెటిన్
*సీజనల్ వ్యాదులు- మంత్రి ఆదేశం
*పేలుడు- 50 మంది మృతి-ఘోర విషాదం
*ఎపి లిప్ట్ పదకం- ఉత్తంకుమార్ రెడ్డి అభ్యంతరం
*కన్నా, సోము ల మద్య పోలిక,తేడాలు
*చంద్రబాబువి టైమ్ పాస్ రాజకీయాలన్న చెవిరెడ్డి
*చంద్రబాబు ఇంటిని జనం చుట్టుముడతారు
*ఎపి స్కూళ్లలో మినరల్ వాటర్ ప్లాంట్లు
*మోడల్ పట్టణాలుగా తాడేపల్లి, మంగళగిరి
*పరిశ్రమలలో భద్రత- సేప్టి పాలసీ-జగన్ సమీక్ష
*చంద్రబాబును వెన్నుపోటుదారుడున్న సుబ్బారాయుడు
*అపూర్వమైన రామాలయానికి భూమి పూజ
*.ఇండియలో కరోనా తీవ్రం- ట్రంప్
*పాకిస్తాన్ దుశ్చర్య- మాప్ లో పెడితే వారికి వస్తుందా
*ప్రైవేటు ఆస్పత్రులకు మంత్రి తీవ్ర హెచ్చరిక
*స్థానిక ఎన్నికలు చెల్లవంటూ టిడిపి మీడియా ..
*ఎపి మంత్రికి, ఇద్దరు ఎమ్మెల్యేలకు కరోనా
*81 కోట్ల చేప పిల్లలను చెరువుల్లో వేస్తాం- తలసాని
*బినామీ ఆస్తుల గురించే- మిదున్ రెడ్డి విమర్శ
*సెప్టెంబర్ 5 నాటికి జగనన్న విద్యా కానుక
*ఎపిలో మరో 15వేల స్కూళ్లలో నాడు-నేడు
*విశాఖ గ్యాస్ లీక్ ఘటనపై జగన్ వ్యాఖ్య
*తెలంగాణలో దళితులపై దాడులు- మల్లు విమర్శ
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info