A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
నాగార్జున సాగర్ లోకి నీళ్లు వదిలారు..గుడ్ న్యూస్
Share |
August 4 2020, 5:29 pm

శ్రీశైలంలో రిజర్వాయిర్ నిండడంతో సాగర్ లోకి నీటిని విడుదల చేయడానికి వీలుగా గేట్లు ఎత్తారు. శ్రీశైలం జలాశయంలో ఆరు క్రస్టు గేట్ల ద్వారా నీటి విడుదల ప్రారంభించారు. రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి అనిల్‌ కుమార్‌ శ్రీశైలం ప్రాజెక్ట్‌ వద్ద ప్రత్యేక పూజలు చేసి నీటి విడుదల ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ మంత్రులు నిరంజన్‌ రెడ్డి, శ్రీనివాస్‌ గౌడ్‌, ఇతర ప్రజా ప్రతినిధులు కూడా పాల్గొనడం విశేషం. మహారాష్ట్ర, కర్ణాటకలో కురుస్తున్న భారీ వర్షాలతో కృష్ణమ్మ పరవళ్లు తొక్కుతోంది. 2009 తర్వాత రికార్డు స్థాయిలో ఇన్‌ఫ్లో కొనసాగుతోంది. జూరాల ప్రాజెక్టు నుంచి శుక్రవారం సాయంత్రం 39 గేట్ల ద్వారా 4,98,96 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. శ్రీశైలం ప్రాజెక్టు గరిష్ఠ నీటి మట్టం 885 అడుగులు, పూర్తిస్థాయి నీటి నిల్వ 215 టీఎంసీలు కాగా... శుక్రవారం సాయంత్రం 6 గంటలకు 880.90 అడుగుల వద్ద 196.96 టీఎంసీలు చేరింది. అటు... ఎగువన జూరాల ప్రాజెక్టు నుంచి 4.91 లక్షల క్యూసెక్కులు వస్తుండటం, మరికొన్నాళ్లపాటు ఇన్‌ఫ్లో కొనసాగుతుందని స్పష్టం కావడంతో శుక్రవారం సాయంత్రమే గేట్లు తెరిచారు. తొలుత నాలుగు గేట్లను తెరిచి 1,04,772 క్యూసెక్కుల నీటిని నాగార్జున సాగర్‌కు విడుదల చేశారు. రాత్రి 10 గంటలకు మరో గేటును తెరిచారు. 11 గంటలకు ఆరో గేటును కూడా తెరిచి... 1,59,084 క్యూసెక్కులను విడుదల చేస్తున్నారు. మరో 15 రోజుల్లో నాగార్జున సాగర్‌ ప్రాజెక్టు కూడా నిండే అవకాశముంది.

tags : srisilam

Latest News
*కరోనాను గాలికి వదలివేశారన్న టి.కాంగ్రెస్
*చంద్రబాబు-ఊడగొట్టిన మంచం కోడు
*ముఖ్యమంత్రి ,ప్రతిపక్ష నేత ఒకే ఆస్పత్రిలో..
* 4 లక్షల డబుల్ లేయర్ మాస్కులు ఇస్తా-మంత్రి
*అమరావతి ఎజెండా రాజీనామా చేయి-బాబుకు సవాల్
*అలుగు జంతు చర్మాల స్మగ్లింగ్ ముఠా పట్టివేత
*తెలంగాణ ఆఫీస్ ల్లో ఈ ఆపీస్ వ్యవస్థ
*విద్యార్దినులకు సైబర్ నేరాలపై అవగాహన
*అన్ని ప్రాంతాల ఆత్మగౌరవం కూడా ముఖ్యమే-నాని
*తమిళనాడులో రెండో రాజదాని ఆలోచనలు
*కరోనా టైమ్ లో ఇళ్లలో ఎలా కూర్చుంటాం..మంత్రి
*అక్కడ ఆరువారాలు పెళ్లిళ్లపై నిషేధం
*ప్లాస్మా దాతలతో గవర్నర్ రక్షాబంధన్
*పాలనా వికేంద్రీకరణ , సిఆర్డిఎ లపై స్టాటస్ కో
*నటుడు సుశాంత్ ఖాతాలో 50 కోట్లు ఉండాలా
*హైకోర్టు జడ్జిలకు నమస్కారాలు పెట్టి..
*మరో సి.ఎమ్. కుటుంబంలో కరోనా
*తెలంగాణ కరోనా రిపోర్టు
*రోగం కంటే భయంతో ఎక్కువ మంది మృతి- ఈటెల
*పుట్ పాత్ వ్యాపారులకు మంత్రి హామీ
*జగన్ పాలన మహిళలకు సువర్ణయుగం
*వైద్యుల నిర్లక్ష్యంపై వైసిపి ఎమ్మెల్యే పిర్యాదు
*బెల్టుషాపులను పూర్తిగా మాఫీ చేశాం-జగన్
*ట్రంప్ నామినేషన్- మీడియాకు నో ఎంట్రి
*మీడియా పాటిజివ్ వార్తలు కూడా రాయాలి-కెటిఆర్
*మహిళలకు భద్రత కల్పిస్తున్న సి.ఎమ్.జగన్
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info