A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
బ్యారేజీలకు కెసిఆర్ పేర్ల సెంటిమెంట్
Share |
January 24 2020, 9:54 am

తెలంగాణ ప్రాజెక్టులకు ముఖ్యమంత్రి కెసిఆర్ సెంటిమెంట్ కూడా జోడిస్తున్నారు.
కాళేశ్వరం ప్రాజెక్టులోని మొదటి బారేజీ మేడిగడ్డకు లక్ష్మి బ్యారేజీగా , దాని ఎగువన కన్నేపల్లి వద్దనున్న పంప్ హౌస్‌కు లక్ష్మి పంప్ హౌస్ అని నామకరణం చేశారు. వరుస ఆనకట్టల్లో రెండో ఆనకట్ట అయిన అన్నారం ఆనకట్టకు సరస్వతి ఆనకట్టగా, అన్నారం పంప్ హౌస్‌కు సరస్వతి పంప్ హౌస్‌గా నామకరణం చేశారు. సుందిళ్ల ఆనకట్టకు పార్వతి ఆనకట్ట అని, గోలివాడ పంప్ హౌస్‌కు పార్వతి పంప్ హౌస్ అని పేరు పెట్టారు. రెండో లింక్‌లో నందిమేడారం వద్ద ఉన్న ఆరో ప్యాకేజీలోని జలాశయం, పంప్ హౌస్‌లకు నంది జలాశయం, పంప్ హౌస్‌గా నామకరణం చేశారు. ఎనిమిదో ప్యాకేజీలోని లక్ష్మీపూర్ పంప్ హౌస్‌కు గాయత్రి పంప్‌ హౌస్‌ అని కెసిఆర్ పేరు పెట్టారు.

tags : kaleswaram,names

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info